Fake News, Telugu
 

ప్రతి సంవత్సరం పూసే ‘Saguaro’ పువ్వు ఫోటో పెట్టి ‘400 ఏళ్ళకి ఒకసారి కనిపించే మహా మేరు/ఆర్య పుష్పము’ అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

2

ఒక పువ్వు ఫోటో పెట్టి అది ‘మహా మేరు/ఆర్య పుష్పము’ అని, అది 400 ఏళ్ళకి ఒకసారి హిమాలయాల్లో కనిపిస్తుందని చాలా మంది సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : ఫోటోలో ఉన్నది 400 ఏళ్ళకి ఒకసారి హిమాలయాల్లో కనిపించే ‘మహా మేరు/ఆర్య పుష్పము’.

ఫాక్ట్ (నిజం): ఫోటోలోని పువ్వు పేరు ‘Saguaro’. అది ప్రతి సంవత్సరం మే-జూన్ నెలల్లో పూస్తుంది. అంతేకాదు, ‘Saguaro’ అమెరికాలోని అరిజోన రాష్ట్రం యొక్క రాష్ట్ర పుష్పము. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.  

పోస్ట్ లోని ఫోటోని క్రాప్ చేసి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటోతో కూడిన వెబ్ సైట్ లింక్ ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ వెబ్ సైట్ లో ఫోటోలోని పువ్వు పేరు ‘Saguaro’ అని ఉంటుంది. ‘Saguaro’ చెట్టు అమరికా లోనే అతి పెద్ద కాక్టస్. ప్రతి సంవత్సరం మే-జూన్ నెలల్లో ‘Saguaro’ చెట్టుకు పువ్వులు పూస్తాయని ఆ వెబ్ సైట్ లో చూడవచ్చు. కావున, 400 ఏళ్ళకి ఒకసారి కనిపిస్తుంది అని చెప్పినదాంట్లో నిజం లేదు.

‘Saguaro’ పుష్పము అమెరికాలోని అరిజోన రాష్ట్రం యొక్క రాష్ట్ర పుష్పము అని అరిజోన రాష్ట్రం కి చెందిన అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు.

‘మహా మేరు/ఆర్య పుష్పము’ పేరుతో హిమాలయాల్లో పుష్పాలు ఉన్నట్టు ఎక్కడా కూడా సమాచారం దొరకదు. అంతేకాదు, గత సంవత్సరం వేరే ఫోటో ఒకటి పెట్టి ఇలానే పోస్ట్ చేసినప్పుడు, అది తప్పు అని ‘HoaxorFact’ వారు రాసినట్టు తెలుస్తుంది. ఇంతకు ముందు కూడా ‘నాగపుష్పము’ అని చెప్తూ ఒక సముద్రపు జీవి ఫోటో వైరల్ అయినప్పుడు ‘FACTLY’ వారు రాసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్ ఇక్కడ చదవచ్చు.

చివరగా, ప్రతి సంవత్సరం పూసే ‘Saguaro’ పువ్వు ఫోటో పెట్టి  ‘400 ఏళ్ళకి ఒకసారి కనిపించే మహా మేరు/ఆర్య పుష్పము’ అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll