Fake News, Telugu
 

పునీత్ రాజ్‌కుమార్ మరణానికి సంబంధించిన ఈ సందేశాన్ని డాక్టర్ దేవి శెట్టి ఇవ్వలేదు

0

ఫిట్‌నెస్ గురుంచి, మితంగా వ్యాయామం చేయడం గురించి ఒక సందేశం డాక్టర్ దేవి శెట్టి ఇచ్చినట్టుగా ఒక పోస్ట్ సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈనాడు దినపత్రిక వారు డాక్టర్ దేవి శెట్టి ఇటువంటి ఒక బహిరంగ లేఖ రాసారని తమ ఆర్టికల్‌లో తెలిపారు. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన పునీత్ రాజ్‌కుమార్ 29 అక్టోబర్ 2021న గుండెపోటుతో మరణించిన తరువాత ఈ సందేశం వైరల్ అయింది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: పునీత్ రాజ్‌కుమార్ మరణానికి సంబంధించి డాక్టర్ దేవి శెట్టి యొక్క సందేశం.

ఫాక్ట్: ఈ సందేశాన్ని డాక్టర్ దేవి శెట్టి ఇవ్వలేదు. డాక్టర్ దేవి శెట్టి ‘నారాయణ హె’ల్త్ ఛైర్మన్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఈయనకు ఆపాదించిన ఈ సందేశం గురుంచి స్పష్టత ఇస్తూ నారాయణ హెల్త్ ఒక ప్రకటన చేసింది. ఈ సందేశం నకిలీదని డాక్టర్ దేవి శెట్టి కూడా ‘ది ఇండియన్  ఎక్స్ ప్రెస్’కు చెప్పారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

కన్నడ సినీనటుడు పునీత్ రాజ్‌కుమార్ మరణానికి సంబంధించి డాక్టర్ దేవి శెట్టి ఈ సందేశాన్ని ఇచ్చారని ఇటీవల రిపోర్ట్ చేసిన ఏ ఇతర న్యూస్ ఆర్టికల్స్ లభించలేదు. అయితే, డాక్టర్ దేవి శెట్టి 29 అక్టోబర్ 2021న టైమ్స్ నౌలో పాల్గొన్న చర్చలో భారతీయుల హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడారు. డాక్టర్ దేవి శెట్టి పునీత్ ను “నిజ జీవితంలో కూడా హీరో” అని అన్నారు. “ఒక డాక్టరుగా పేషంట్ పరిస్థితి గురి౦చి, స౦ఘటనల గురి౦చి చర్చి౦చడానికి నాకు ఇష్ట౦ లేదు” అని కూడా ఆయన అన్నారు. పునీత్ రాజ్‌కుమార్ గురించి ప్రత్యేకంగా మాట్లాడటానికి నిరాకరించారు. డాక్టర్ దేవి శెట్టి పోస్టులోని సందేశంలో రాసిన విషయాలను చెప్పలేదు.

డాక్టర్ దేవి శెట్టి, ‘నారాయణ హెల్త్’ ఛైర్మన్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నో ఆసుపత్రుల నెట్ వర్క్ ను నడుపుతోంది నారాయణ హెల్త్. డాక్టర్ దేవి శెట్టికి ఆపాదించబడిన వైరల్ మెసేజ్ గురించి నారాయణ హెల్త్ ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో, “డాక్టర్ దేవి శెట్టి నుండి వచ్చిందన్న ఈ సందేశం నకిలీదని మరియు అతని కార్యాలయం నుండి ఇది వెలువడలేదని ఎన్ హెచ్ స్పష్టం చేయాలనుకుంటున్నారు. అతనికి చేసిన ఏదైనా రిఫరెన్స్ లేదా ఆట్రిబ్యూషన్ తప్పు.” అని స్పష్టం చేసారు.

ఈ సందేశం వాట్సప్ లో వైరల్ కావడంతో, ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఇది ఒక ఫేక్ మెసేజ్ అని డాక్టర్ దేవి శెట్టిని అడిగి తెలుసుకున్నారు. “డాక్టర్ ఇది ఒక ఫేక్ మెసేజ్ అని ఇండియన్  ఎక్స్ ప్రెస్ కు చెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి తన పేరును ఉపయోగించడం పట్ల తన ఆవేదన వ్యక్తం చేసారు“, అని ఆర్టికల్ లో పేర్కొన్నారు.

కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన పునీత్ రాజ్‌కుమార్ 29 అక్టోబర్ 2021న గుండెపోటుతో మరణించారు. బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్స్ లో కార్డియోవాస్కులర్, థొరాసిక్ సర్జన్ డాక్టర్ దేవానంద్ ఎన్ఎస్ మాట్లాడుతూ,పునీత్ మరణించటం వలన వ్యాయామంచెడ్డదని కాదు. మీకు అవసరమైనది మీరు చేయాలి. ఒకరికి ఏది సరిపోతుందో అది మరొకరికి సరిపోకపోవచ్చు. ఇక్కడ ఒకే ఒక పాఠం ఉందని నేను అనుకుంటున్నాను – ఏది చేసినా మితంగా చేయడం మంచిది.”

డాక్టర్ దేవి శెట్టి పేరును ఇంతకు ముందు ఇతర పోస్టులలో కూడా ఉపయోగించారు. Factly ఒక పోస్ట్ గురించి ఫాక్ట్ చెక్ ఆర్టికల్ కూడా రాసింది.

చివరగా, పునీత్ రాజ్‌కుమార్ మరణానికి సంబంధించిన ఈ సందేశాన్ని డాక్టర్ దేవి శెట్టి ఇవ్వలేదు.

Share.

About Author

Comments are closed.

scroll