Fake News, Telugu
 

సంబంధం లేని ఫోటోలు పెట్టి రోహింగ్యా ముస్లింలు హిందువులను చంపినవని ఆరోపిస్తున్నారు

1

మయన్మార్ లో రోహింగ్యా ముస్లింలు అక్కడి హిందువులను క్రూరంగా చంపుతున్నారంటూ ఒక వార్తా పత్రిక రాసిన కథనం యొక్క స్క్రీన్ షాట్ ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, కొంతమంది యువతులను హింసిస్తున్న మరియు  చంపిన  ఫోటోలను కూడా దానితో పాటు పెట్టి, అవి రోహింగ్యా ముస్లింలు హిందువులను చంపడానికి సంబంధించిన ఫోటోలు అంటూ ఆరోపిస్తున్నారు. పోస్టులో చేసిన ఆరోపణలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : రోహింగ్యా ముస్లింలు హిందూ యువతులను క్రూరంగా చంపిన ఫోటోలు.    

ఫాక్ట్ (నిజం): పోస్టులో పెట్టిన రెండు ఫోటోలు శ్రీలంక ఆర్మీ వారు ఆ దేశ యువతులను చంపినవి. మరొక ఫోటో, అక్రమ రవాణా కి గురై లండన్ లో లభించిన ఒక మహిళకి సంబంధించినది. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు.

ఫోటో-1:

ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఆ ఫోటో తప్పిపోయి బంధించబడిన ఒక యువతికి సంబంధించినదని చాలా సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. ఆ ఫోటో ని ‘Shutterstock’ వారి లైబ్రరీ లో కూడా చూడవచ్చు. ‘Evening Standard’ అనే వార్తా సంస్థ వారి కథనం ద్వారా, ఆ ఫొటోలో ఉన్నది అక్రమ రవాణా కి గురై లండన్ లో లభించిన ఒక మహిళ అని తెలుస్తోంది.

ఫోటో-2:

ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఆ ఫోటో శ్రీలంక ఆర్మీ వారు ఆ దేశ యువతిని చంపడంకి సంబంధించినదని చాలా సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. ఆ ఫోటోని మొట్టమొదటిసారిగా ‘Oodaru’ అనే ఒక న్యూస్ వెబ్సైటు డిసెంబర్ 1, 2010న శ్రీలంక ఆర్మీ వారి యుద్ధ నేరాల మీద రాసిన కథనంలో పెట్టినట్లుగా తెలుస్తోంది.

ఫోటో-3:

ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఆ ఫోటో శ్రీలంక ఆర్మీ వారు ఆ దేశ యువతిని చంపడానికి సంబంధించినదని చాలా సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. ఆ ఫోటోని మొట్టమొదటిసారిగా ‘Colombo Telegraph’ అనే ఒక వర్డ్ ప్రెస్ ఆర్టికల్ లో శ్రీలంక ఆర్మీ వారు ఆ దేశ యువతులను రేప్ చేసి క్రూరంగా చంపడం గురించి మార్చ్ 9, 2012న రాసిన కథనం లో లభించింది.

పోస్టులో ఉన్న మరొక ఫోటో గురించి వెతికినప్పుడు, దానికి సంబంధించిన ఎటువంటి విశ్వసనీయ సమాచారం లభించలేదు.

చివరగా, సంబంధం లేని ఫోటోలు పెట్టి రోహింగ్యా ముస్లింలు హిందువులను చంపినవి అని ఆరోపిస్తున్నారు. 

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll