Fake News, Telugu
 

చైనా ఉత్పత్తుల గురించి ‘బిశ్వజిత్ ముఖర్జీ’ పేరుతో వస్తున్నది ఒక ఫేక్ మెసేజ్.

1

భారతదేశం పై ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్తాన్ కి చైనా సహాయం చేస్తుందని, భారత్ కి వచ్చే బాణసంచాల్లో ప్రత్యేక రసాయనాలను కలుపుతుందని, కావున ఈ దీపావళికి చైనా ఉత్పత్తులను ఉపయోగించవద్దని భారత హోం మంత్రిత్వశాఖ రిటైర్డ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బిశ్వజిత్ ముఖర్జీ తెలిపినట్టు సోషల్ మీడియా లో ఒక మెసేజ్ ని చాలా మంది పోస్ట్ చేస్తున్నారు. ఆ మెసేజ్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : విషపూరిత రసాయనాలను కలుపుతున్నందున ఈ దీపావళికి చైనా ఉత్పత్తులను ఉపయోగించవద్దని చెప్పిన బిశ్వజిత్ ముఖర్జీ (రిటైర్డ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, హోం మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం).    

ఫాక్ట్ (నిజం): ‘బిశ్వజీత్ ముఖర్జీ’ అనే పేరుతో హోం మంత్రిత్వశాఖలోఎటువంటి ఆఫీసర్ లేడు. పోస్టులోని మెసేజ్ ని హోం మంత్రిత్వ శాఖ తెలిపినట్టు ఎక్కడాకూడా సమాచారం లేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్టులోని మెసేజ్ గురించి వెతకగా, అదే మెసేజ్ గత రెండేళ్ళగా సోషల్ మీడియా లో షేర్ అవుతున్నట్టుగా తెలుస్తుంది.

‘బిశ్వజీత్ ముఖర్జీ’ అనే పేరుతో హోం మంత్రిత్వశాఖలో ఎవరైనా ఆఫీసర్ ఉన్నారా అని వెతకగా, ఆ పేరుతో ఎవరు లేరని తెలుస్తుంది.

అంతేకాదు, పోస్టులోని మెసేజ్ ని హోం మంత్రిత్వశాఖ తెలిపినట్టుగా ఎక్కడా కూడా సమాచారం లేదు. ఈ మెసేజ్ ఇంతకుముందు వైరల్ అయినప్పుడు మిగితా ఫాక్ట్ చెకింగ్ సంస్థలు హోం మంత్రిత్వశాఖ కి ఫోన్ చేసి అడగగా, అది ఒక ఫేక్ మెసేజ్ అని వారు తెలిపినట్టుగా తెలుస్తుంది. గతంలో చైనా బాణసంచాల్లోని పొటాషియం క్లోరేట్ వల్ల అవి హానికరం అని వార్తాసంస్థలు రాసిన ఆర్టికల్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. కానీ, పోస్ట్ లోని మెసేజ్ ని మాత్రం హోం మంత్రిత్వశాఖ ఇవ్వలేదు.

భారత ప్రభుత్వ ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ కూడా ఇది ఫేక్ మెసేజ్ అని 2020లోనే చెప్పింది.

చివరగా, చైనా ఉత్పత్తుల గురించి ‘బిశ్వజిత్ ముఖర్జీ’ (రిటైర్డ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్) పేరుతో వస్తున్నది ఒక ఫేక్ మెసేజ్.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll