Fake News, Telugu
 

చల్లని నీరు తాగటం వల్ల గుండెపోటు, కాలేయ సమస్యలు వస్తాయని చెప్పటానికి కచ్చితమైన శాస్త్రీయ ఆధారాలు లేవు

0

కూల్ వాటర్ లివర్ సమస్యలకు మరియు గుండెపోటుకు దారి తీస్తుంది అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులోని నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొందాం.

క్లెయిమ్: చల్లని నీరు మరియు డ్రింక్స్ తాగటం వల్ల గుండెపోటు మరియు కాలేయ సమస్యలు వస్తాయి.

ఫాక్ట్(నిజం): పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్లుగా అసలు చల్లని నీరు లేదా డ్రింక్స్ తాగటం గుండెపోటుకు గాని కాలేయ/లివర్ రోగాలకు దారి తీస్తుంది అని చెప్పటానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. గుండెపోటు లేదా కాలేయ రోగాలకు మద్యపానం, ధూమపానం, అధిక కొలెస్ట్రాల్ వంటి తదితర కారణాలు ఉన్నాయి. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

గుండెపోటుకు మరియు కాలేయ వ్యాధులకు సాధారణమైన కారణాలు ఏంటో తెలుసుకోవటానికి ఇంటర్నెట్లో వెతకగా, అమెరికా దేశ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ అయిన ‘సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ (CDC) ఆర్టికల్ లభించింది. దీని ప్రకారం, రక్తపోటు, అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్ లెవెల్స్, ఆల్కహాల్, ధూమపానం, etc. వంటి వాటిని గుండెపోటుకు దారి తీసేవిగా ప్రస్తావించారు. చల్లని నీరు తాగటాన్ని ఒక కారణంగా రాయలేదు (ఇది కుడా చదవండి). CDC మరియు మాయోక్లినిక్ లివర్ లేదా కాలేయ రోగాలకు దారి తీసే అలవాట్లలో ఎక్కడా కూడా చల్లటి నీరు తాగటాన్ని గురించి ప్రస్తావించలేదు. ఒబేసిటీ, మద్యపానం వంటి తదితర కారణాలు గురించి రాసారు.

చల్లని నీరు త్రాగటం వల్ల పోస్టులో క్లెయిమ్ చేస్తున్నటువంటి సమస్యలు వస్తాయా అని ఏమైనా రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయా అని ఇంటర్నెట్లో వెతకగా, తగిన ఆధారాలు లభించలేదు. నైజీరియాకి సంబంధించిన మీడియా హౌస్ ప్రీమియంటైమ్స్ వారు ఇదే క్లెయిమ్ మీద రాసిన ఫాక్ట్ చెక్ ఆర్టికల్ లో, చల్లటి నీరు కడుపులోకి వెళ్ళాక ఐదు నిమిషాల్లో అది వేడెక్కుతుంది అని రాసారు.

‘పేసా చెక్’ అనే అంతర్జాతీయ ఫాక్ట్ చెక్ సంస్త రాసిన ఫాక్ట్ చెక్ ఆర్టికల్ లో, డాక్టర్ ఫెస్ట్స్ టొలో, కెన్యా మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లోని ఒక రెసెర్చెర్ మాట్లాడుతూ, చల్లని నీరు తాగటం  గుండెపోటుకు దారి తీస్తుందని ఎటువంటి ఆధారం లేదు అని అన్నారు. ‘చల్లని నీరు తాగటం మన దేహానికి కానీ, ఇంటర్నల్ అవయవాలకు కానీ ఎటువంటి హాని కలిగించదు’ అని పేసా చెక్  వారికి చెప్పారు.

చల్లని నీరు తాగటం, ముందు నుంచే గుండె సంబంధిత రోగాలు ఉన్న వారికి ఇబ్బంది కలిగించవచ్చు అని ఈ రీసెర్చ్ పేపర్ చెప్తుంది. అసలు చల్లని నీరు తాగటం వల్ల ఏమైనా హాని ఉందా అనే విషయం పైన మెడికల్ న్యూస్ టుడే వారు మరియు హెల్త్ లైన్ వారు రాసిన ఆర్టిల్స్స్ ఇక్కడ మరియు ఇక్కడ చదవండి.  

చివరిగా, చల్లని నీరు తాగటం వల్ల గుండెపోటు మరియు కాలేయ సమస్యలు వస్తాయని చెప్పటానికి ఎటువంటి కచ్చితమైన శాస్త్రీయ ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll