ప్రపంచంలో మరే జంతువుకు లేని చాలా ప్రత్యేకతలు గోవుకి ఉన్నాయి అని ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులోని ఎంత నిజముందో తెలుసుకుందాం.
క్లెయిమ్: ఆవుకి విషాన్ని ఎక్కించి 90 రోజుల పాటు పరీక్షించారు.
ఫాక్ట్: పోస్ట్ లో చెప్పిన విధంగా ఆవుకి విషం ఎక్కించి పరీక్ష చేసినట్టు ఎక్కడా ఎటువంటి ఆధారాలు లేవు. కావున ఈ పోస్ట్ లో చెప్తున్నది తప్పు.
పోస్టులో ఉన్న వీడియోలోని స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా ఒక యూట్యూబ్ వీడియో లభించింది. ఈగల్ మీడియా వర్క్స్ అనే యూట్యూబ్ ఛానల్‌లో ఉన్న ఆ వీడియోలోని మొదట నిమిషం పోస్ట్ లోని వీడియోతో మ్యాచ్ అవుతుంది.
ఈ వీడియోలో ఆవుకి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వాళ్ళు 90 రోజుల పాటు విషాన్ని ఇచ్చి పరీక్ష చేసినట్లు చెప్పారు. పరీక్ష ఫలితాల్లో ఆవు తన కంఠంలో విషాన్ని దాచుకున్నట్లు, పేడలో కానీ, పాలల్లో కానీ, మూత్రంలో కానీ విషం లభించలేదు అని తేలింది అని ఆ వీడియోలో చెప్తున్నారు.
సరైన కీవర్డ్స్ తో ఇంటర్నెట్ లో సెర్చ్ చెయ్యగా ది హిందూ పత్రిక వారు ప్రచురించిన ఒక ఆర్టికల్ లభించింది. డి.బాలసుబ్రమనియన్ రాసిన ఈ ఆర్టికల్ లో ఆయన తనకు తన కజిన్ ఆవుకు ఉన్న అద్భుతమైన గుణాలు అని ఒక లింక్ షేర్ చేసినట్లు చెప్పారు. కానీ, ఇప్పుడు ఆ లింక్ పనిచేయటం లేదు.
తను ఈ లింక్‌లో ఉన్న ఆర్టికల్‌లో ఉన్న విశేషాలు ఎందుకు అశాస్త్రీయం అని తన ఆర్టికల్‌లో వివరించారు. 90 రోజుల పాటు ఆవుకు విషం ఇచ్చి పరీక్ష చేసిన క్లెయిమ్ గురించి ఆయన మాట్లాడుతూ ‘AIIMSలోని కొంతమంది ఫ్యాకల్టీ సభ్యులతో విచారించగా అక్కడ అలాంటి ప్రయోగమేమీ జరగలేదని. అసలు ఇన్‌స్టిట్యూట్ యొక్క యానిమల్ ఎథిక్స్ కమిటీ జంతువులకు ఎటువంటి విషాన్ని తినిపించడాన్ని అనుమతించి ఉండేది కాదు – అది కూడా 90 రోజులుపాటు నిరంతరంగా !’ అని తెలిపారు.
ఇంత పెద్ద సంస్థ చేసిన పరిక్ష, దాని ఫలితాలు, చేసిన డాక్టర్స్, రాసిన రీసెర్చ్ పేపర్స్ ఇంటర్నెట్ లో లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ అలాంటి పరిశోధనకు సంబంధించి ఎటువంటి సమాచారం, పత్రాలు మాకు దొరకలేదు.
సుబ్రమణియన్ గారు తను రాసిన ఆర్టికల్‌లో ఇలా ఆవుకు ఆపాదిస్తున్న మరిన్ని అశాస్త్రీయ విషయాలపై వివరంగా రాసారు. ఆవు యొక్క కిలో నెయ్యితో యజ్ఞం చేస్తే ఒక టన్నుడు ప్రాణవాయువు ఉత్పత్తి అవుతుందని ప్రచారం అయిన క్లెయిమ్ తప్పని చెప్తూ FACTLY రాసిన ఆర్టికల్ ఇక్కడ చదవొచ్చు.
చివరిగా, ఆవుకి విషం ఇచ్చి 90 రోజుల పోటు పరీక్ష చేసారు అనడానికి ఎటువంటి రుజువు లేవు. అది అవాస్తవం.