Fake News, Telugu
 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిజాయితీపై బిల్ గేట్స్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు

0

తన 65 ఎళ్ల జీవితకాలంలో మోదీ లాంటి నిజాయితీ పరుడైన రాజకీయవేత్తను చూడలేదని  బిల్ గేట్స్ వ్యాఖ్యానించినట్లు క్లెయిమ్ చేస్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: నా 65ఎళ్ల జీవితకాలంలో మోదీ లాంటి నిజాయితీ పరుడైన రాజకీయవేత్తను చూడలేదు – బిల్ గేట్స్.

ఫాక్ట్(నిజం): వ్యాపారవేత్త బిల్ గేట్స్ భారత ప్రధాని మోదీని గతంలో పలుసార్లు ప్రశంసించారు. భారత దేశంలో ఆరోగ్య సంరక్షణ మరియు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ పైన ప్రాధాన్యత చూపుతూ మోదీ భారత దేశాన్ని అభివృద్ధి పథాన నడుపుతున్నారు అని బిల్ గేట్స్ 75వ స్వతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొనియాడారు. కానీ పోస్టులో చెప్తున్నట్లుగా తన జీవితకాలంలో మోదీ లాంటి నిజాయితీ పరుడైన రాజకీయవేత్తను చూడలేదని ఆయన అన్నట్టు ఎటువంటి ఆధారాలు లేవు. కావున, పోస్టులోని క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ప్రధాని మోదీ నిజాయితీపై వ్యాపారవేత్త బిల్ గేట్స్ పోస్టులో చెప్తున్నటువంటి వ్యాఖ్యలు చేసారా అని సంబంధిత కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, బిల్ గేట్స్ ఆలా ప్రధాని గురించి అభిప్రాయ పడినట్లు ఎటువంటి వార్తా కథనాలు లభించలేదు. సాధారణంగా బిల్ గేట్స్ ,నరేంద్ర మోదీ లాంటి వ్యక్తులకి సంబంధించి విషయాలు వార్తల్లో వస్తాయి, కానీ ఈ విషయం గురించి ఎటువంటి కథనాలు కూడా లేవు.

కానీ ప్రధాని మోదీ గురించి గతంలో పలు సార్లు బిల్ గేట్స్ వాఖ్యానించారు. భారత దేశంలో 200 కోట్ల కరోనా టీకా డోసులు పూర్తయిన సందర్భంలో బిల్ గేట్స్ మోదీని ప్రశంసించారు (ఇక్కడ మరియు ఇక్కడ). భారత్ 75వ స్వతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా కూడా గేట్స్, నరేంద్ర మోదీ ఆరోగ్య సంరక్షణ మరియు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ పైన ప్రాధ్యాన్యత చూపుతూ భారత దేశాన్ని అభివృద్ధి పథాన నడుపుతున్నారు అని ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు.

కరోనా మొదాటి వేవ్ సమయంలో కూడా ఇన్ఫెక్షన్ రేట్ తగ్గటానికి మోదీ తీసుకొన్న ముందు జాగ్రత్త చర్యలను, ఆయన నాయకత్వాన్ని మెచ్చుకుంటూ బిల్ గేట్స్ లేఖ రాసారు. కానీ ఏ సందర్భంలో కుడా అయన ప్రధానిపై పోస్టులో క్లెయిమ్ చేస్తున్న వ్యాఖ్యలు చెయ్యలేదు.

చివరిగా, నరేంద్ర మోదీ నిజాయితీపై బిల్ గేట్స్ ఈ పోస్టులో చెప్తున్నటువంటి వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll