Fake News, Telugu
 

మలబార్ ఛారిటబుల్ ట్రస్ట్ కులాల, మతాల ఆధారంగా విధ్యార్ధినులకు స్కాలర్షిప్ అందిచడం లేదు

0

మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ వ్యాపార సంస్థలో భాగమైన మలబార్ ఛారిటబుల్ ట్రస్ట్ కేవలం ముస్లిం విధ్యార్ధినులకు మాత్రమే విద్య కోసం స్కాలర్షిప్ అందిస్తుందని సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతోంది. బురఖా ధరించిన ముస్లిం విధ్యార్ధినులు మలబార్ ఛారిటబుల్ ట్రస్ట్ స్కాలర్షిప్ పట్టాలను పట్టుకొని దిగిన ఒక గ్రూప్ ఫోటోని ఈ పోస్టులో షేర్ చేశారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

క్లెయిమ్: మలబార్ ఛారిటబుల్ ట్రస్ట్ కేవలం ముస్లిం విధ్యార్ధినులకు మాత్రమే విద్య కోసం స్కాలర్షిప్ సహాయం అందజేస్తుంది.

ఫాక్ట్ (నిజం): మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ వ్యాపార సంస్థలో భాగమైన మలబార్ ఛారిటబుల్ ట్రస్ట్ కులాల, మతాల ఆధారంగా విధ్యార్ధినులకు స్కాలర్షిప్ పంపిణీ చేయడం లేదు. మెరిట్ మరియు కుటుంబ ఆర్ధిక పరిస్థితుల ఆధారంగా మాత్రమే మలబార్ ఛారిటబుల్ ట్రస్ట్ సంస్థ స్కాలర్షిప్ కోసం విధ్యార్ధినులను ఎంపిక చేస్తారు. కేవలం ముస్లిం విధ్యార్ధినులు మలబార్ ఛారిటబుల్ ట్రస్ట్ స్కాలర్షిప్ పట్టాతో దిగిన ఒక ఫోటోని షేర్ చేస్తూ మలబార్ ఛారిటబుల్ ట్రస్ట్ కేవలం ముస్లింలకు మాత్రమే స్కాలర్షిప్ అందిస్తుందని తప్పుగా షేర్ చేస్తున్నారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోకి సంబంధించిన వివరాల కోసం ఇంటర్నెట్‌లో వెతికితే, ఈ ఫోటోని షేర్ చేస్తూ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ వారు పబ్లిష్ చేసిన ఒక పాంప్లెట్ కాపీ దొరికింది. మంగళూరులో మలబార్ ఛారిటబుల్ ట్రస్ట్ సుమారు 60 కాలేజీలలో చదువుతున్న 630 మంది విధ్యార్ధినులకు స్కాలర్షిప్ అందచేసినట్టు ఈ పాంప్లెట్లో తెలిపారు. ఈ పాంప్లెట్లో తెలిపిన వివరాల ప్రకారం ఫోటోలో కనిపిస్తున్న విధ్యార్ధినులు ఉప్పినంగాడి ప్రభుత్వ PU కాలేజీ విధ్యార్ధులని తెలుస్తుంది.

కానీ, ఈ పాంప్లెట్లో ప్రచురించిన చిత్రాలలో మలబార్ ఛారిటబుల్ ట్రస్ట్ వారు ముస్లిం విధ్యార్ధినులతో పాటు వేరే మతాలకు సంబంధించిన విధ్యార్ధినులకు కూడా స్కాలర్షిప్ అందచేసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. మలబార్ ఛారిటబుల్ ట్రస్ట్ మంగళూరులో నిర్వహించిన ఈ స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన మరికొన్ని ఫోటోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ ఫోటోలలో, పోస్టులో షేర్ చేసిన ఫొటోల్లో కనిపించిన వ్యక్తులు హిందూ విధ్యార్ధినులకు కూడా స్కాలర్షిప్ అందజేస్తున్న చిత్రాలని చూడవచ్చు. ఈ కార్యక్రమానికి సంబంధించి వార్తా సంస్థలు పబ్లిష్ చేసిన న్యూస్ రీపోర్టులని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

కులాల, మతాల వివక్ష లేకుండా పేద విధ్యార్ధుల చదువులకు సహాయం అందిచడం కోసం మలబార్ ఛారిటబుల్ ట్రస్ట్ స్కాలర్షిప్ అందజేస్తూ వస్తుందని మలబార్ ఛారిటబుల్ ట్రస్ట్ తమ వెబ్సైట్లో తెలిపారు. విధ్యార్ధినుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్న ఈ స్కాలర్షిప్ కేవలం మెరిట్ మరియు కుటుంబ ఆర్ధిక పరిస్థితుల ఆధారంగా విధ్యార్ధులను సెలెక్ట్ చేస్తామని మలబార్ ఛారిటబుల్ ట్రస్ట్ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో తెలిపింది.

మలబార్ సంస్థ కేవలం ముస్లింలకు మాత్రమే స్కాలర్షిప్ అందిస్తుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుకార్లపై మలబార్ ఛారిటబుల్ ట్రస్ట్ యాజమాన్యం FACTLYతో మాట్లాడుతూ, “సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఈ వార్తలు పూర్తిగా తప్పు. మలబార్ ఛారిటబుల్ ట్రస్ట్ కులాల, మతాల ఆధారంగా స్కాలర్షిప్ అందజేయదు”, అని తెలిపారు. కేవలం ముస్లిం విధ్యార్ధినులు మలబార్ ఛారిటబుల్ ట్రస్ట్ స్కాలర్షిప్ పట్టాతో దిగిన ఒక గ్రూప్ ఫోటోని షేర్ చేస్తూ మలబార్ ఛారిటబుల్ ట్రస్ట్ కేవలం ముస్లింలకు మాత్రమే స్కాలర్షిప్ అందిస్తుందని తప్పుగా షేర్ చేస్తున్నారు.

చివరగా, మలబార్ ఛారిటబుల్ ట్రస్ట్ కులాల, మతాల ఆధారంగా విధ్యార్ధినులకు స్కాలర్షిప్ అందిచడం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll