Fake News, Telugu
 

వెంకయ్య నాయుడు తో ఫొటోలో చీర కట్టుకొని ఉన్నది కొలంబియా ఉప ప్రధాని కాదు

0

భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తో చీర కట్టుకొని ఒక మహిళ ఉన్న  ఫొటో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, ఆమె కొలంబియా ఉప ప్రధాని అని ఆరోపిస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంత నిజం వుందో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తో చీర కట్టుకొని ఉన్న కొలంబియా ఉప ప్రధాని ఫొటో.

ఫాక్ట్ (నిజం): ఫొటోలో వెంకయ్య నాయుడు తో చీర కట్టుకొని ఉన్నది రొమానియా ఉప ప్రధాని ‘అన బిర్చల్’. కావున, పోస్ట్ లోని క్లెయిమ్ తప్పు.   

పోస్టులోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఆ ఫొటో లో చీరలో ఉన్న మహిళ రొమానియా ఉప ప్రధాని అని చాలా సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. ఆ సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చిన ఒక ట్వీట్ ద్వారా ఆ ఫొటోలో ఉన్న మహిళ రొమేనియా ఉప ప్రధాని ‘అనా బిర్చల్’ అని తెలిసింది. అలాంటి ఫోటోనే ‘ANI’ వారు 2018లో భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రోమానియా పర్యటనకి వెళ్లారంటూ రాసిన కథనం లో చూడవచ్చు. అంతేకాదు, గత  సంవత్సరం  వెంకయ్య  నాయుడు రోమానియా  వెళ్ళినప్పుడు తీసిన  ఫోటోని  పెట్టి, తాజాగా చైనా లీడర్ (Xi Jinping) ని మోడీ  కలిసినప్పుడు  వేసుకున్న వస్త్రాధరణ వల్ల కొలంబియా ఉప ప్రధాని కూడా భారతదేశానికి చీర  కట్టుకొని వచ్చిందని తప్పుగా  ప్రచారం  చేస్తున్నారు.

చివరగా, వెంకయ్య నాయుడు తో ఫొటోలో చీర కట్టుకొని ఉన్నది కొలంబియా ఉప ప్రధాని కాదు, ఆమె రొమానియా ఉప ప్రధాని ‘అన బిర్చల్’.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll