Fake News, Telugu
 

1857 తిరుగుబాటు ఉద్యమంలో వీర్ సావర్కర్ పాల్గొన్నాడని అమిత్ షా వ్యాఖ్యానించలేదు

1

ఒక కొలేజ్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. అందులో పైన ఉన్న ఫొటోలో వీర్ సావర్కర్ లేకుండా 1857 తిరుగుబాటు చారిత్రాత్మకం అయి ఉండేది కాదు అని అమిత్ షా అన్నట్లుగా ఉంటుంది మరియు క్రింది ఫొటోలో వీర్ సావర్కర్ 1883 లో పుట్టినట్లుగా ఉంటుంది. ఈ కొలేజ్ పోస్టు ఫేస్బుక్ లో పోస్టు చేసి, 1857 తిరుగుబాటు ఉద్యమంలో వీర్ సావర్కర్ పాల్గొన్నాడని అమిత్ షా వ్యాఖ్యానించాడనే ఆరోపణతో షేర్ చేస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వీర్ సావర్కర్ 1857 తిరుగుబాటు ఉద్యమంలో పాల్గొన్నాడని అమిత్ షా వ్యాఖ్యానించాడు.

ఫాక్ట్ (నిజం): ‘వీర్ సావర్కర్ లేకపోతే, 1857 తిరుగుబాటు ఉద్యమం చారిత్రాత్మకం అయి ఉండేది కాదు, దానిని కూడా బ్రిటీష్ వారి కోణం నుండే చూసేవాళ్ళం. 1857 తిరుగుబాటును మొదటి స్వాతంత్య్ర పోరాటంగా మొట్టమొదట పేర్కొన్నది వీర్ సావర్కర్’ అని అమిత్ షా వ్యాఖ్యానించాడు. అంతేకాని, వీర్ సావర్కర్ 1857 తిరుగుబాటు ఉద్యమంలో పాల్గొన్నాడని అమిత్ షా పేర్కొనలేదు. కావున పోస్ట్ ప్రక్కద్రోవ పట్టించేలా ఉంది.

పోస్టులో ఉన్న కొలేజ్ లో ‘India Today’ ఆర్టికల్ యొక్క ఫోటో ని చూడవచ్చు. ఆ ఆర్టికల్ చూసినప్పుడు, అమిత్ షా వారణాసి లో జరిగిన ఒక ఈవెంట్ లో ‘వీర్ సావర్కర్ లేకపోతే, 1857 తిరుగుబాటు ఉద్యమం చారిత్రాత్మకం అయి ఉండేది కాదు’ అని అన్నట్లుగా తెలిసింది. అందులో ఎక్కడా కూడా 1857 తిరుగుబాటు ఉద్యమంలో వీర్ సావర్కర్ పాల్గొన్నాడని అమిత్ షా వ్యాఖ్యానించినట్లుగా లేదు. మరింత సమాచారం కోసం వెతికినప్పుడు, ‘ANI’ వారి ట్వీట్ లభించింది. అందులో ఉన్న విషయం యొక్క తెలుగు అనువాదం ఈ విధంగా ఉంది- ‘వీర్ సావర్కర్ లేకపోతే, 1857 తిరుగుబాటు ఉద్యమం చారిత్రాత్మకం అయి ఉండేది కాదు, దానిని కూడా బ్రిటీష్ వారి కోణం నుండే చూసేవాళ్ళము. 1857 తిరుగుబాటును మొదటి స్వాతంత్య్ర పోరాటంగా మొట్టమొదట పేర్కొన్నది వీర్ సావర్కర్ అని అమిత్ షా వ్యాఖ్యానించాడు’. ఆ ప్రసంగానికి సంబంధించిన వీడియో ని చూసినప్పుడు కూడా అమిత్ షా ఇంతకుముందు ట్వీట్ లో ఉన్న వ్యాఖ్యలే చేసినట్లుగా తెలుస్తుంది.

చివరగా, 1857 తిరుగుబాటు ఉద్యమంలో వీర్ సావర్కర్ పాల్గొన్నాడని అమిత్ షా వ్యాఖ్యానించలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll