ఒక వ్యక్తి తను సంజీవ రెడ్డి నాగర్ అత్యాచార నిందుతుడి తండ్రి అని మాట్లాడుతూ, తన కొడుకు ఒక అమ్మాయిని అత్యాచారం చేశాడు అని పోలీసులు అరెస్ట్ చేస్తే, తన కొడుకు ఆ పని చేసి ఉండడు అనే నమ్మకంతో అతన్ని డబ్బు మరియు హోదా ఉపయోగించి బయటికి తీసుకొచ్చిన తరువాత తన కొడుకు నిజంగానే రేప్ చేసాడు అని తెలిసింది అని, అతనికి మరియు అతని కొడుకుకి ఎటువంటి శిక్ష వేసినా తాను అంగీకరిస్తాను అని ఏడుస్తూ తన మాటలను రికార్డ్ చేసుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) విస్తృతంగా షేర్ చేస్తున్నారు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: ఈ వీడియో సంజీవ రెడ్డి నగర్ ఆత్యాచార నిందుతుడి తండ్రి, తన కొడుకు ఒక అమ్మాయి పైన అత్యాచారం చేసినందుకు అతని కొడుకుతో పాటు తనని కూడా శిక్షించాలి అని మాట్లాడుతూ రికార్డ్ చేసుకున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): ఇది నిజంగా జరిగిన ఘటన కాదు. ఇది రాజ్ మాదిరాజు అనే యాక్టర్/డైరెక్టర్ ఒక సోషల్ ఎక్సపరిమెన్ట్‌లో భాగంగా చేసిన వీడియో. రాజ్ ఈ వీడియో గురించి మాట్లాడుతూ, అది నిజం కాదు అని తెలిపారు. వీడియోలో వివరణ ఇస్తే ప్రజలలో ఈ ఎక్స్పీరిమెంట్ యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇది నిజమైన సంఘటన కాదు అనే హెచ్చరిక వీడియోలో ఇవ్వలేదు అని తెలిపారు. అంతే కాకుండా, తాను వీడియోలో ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ అనే పదాలను వాడిందువల్ల ఆ స్టేషన్ యొక్క పోలీసులకు ఈ సంఘటన గురించి ఆరా తీస్తూ చాలా ఫోన్లు వచ్చాయని దానికి క్షమాపణ అడుగుతున్నాను అని, ఈ వీడియో ఫేమ్ కోసం చేసింది కాదు అంటూ రాజ్ మాదిరాజు స్పష్టం చేసారు. కావున, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
వైరల్ వీడియో యొక్క కీ ఫ్రేములను ఉపయోగిస్తూ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే, ఈ వీడియో షేర్ చేసిన ఒక X పోస్టు కింద కామెంట్ చేస్తూ ఒక యూజర్, ఈ వీడియోలో ఉన్నది రాజ్ మాదిరాజు అనే ఒక యాక్టర్/డైరెక్టర్ అని ఒక స్క్రీన్ షార్టును షేర్ చేశాడు. కొందరు ఇది ఒక రిహార్సల్ వీడియో అని కామెంట్ చెయ్యటం గమనించాం.
దీన్ని ఆధారంగా తీసుకొని వెతికితే, రాజ్ మాదిరాజు యొక్క ఫేస్బుక్ పేజీలో వైరల్ వీడియోను “ఒక చిన్న ప్రయత్నం…మూడున్నర నిమిషాలు” అనే శీర్షికతో 29 ఆగస్ట్ 2024న పోస్టు చేశాడని కనుగొన్నాం. తరువాత, 31 ఆగస్ట్ 2024న ఈ వీడియో నిజంగా జరిగిన సంఘటన కాదు అని పోస్టు రాజ్ చేశాడు.
తరువాత అదే రోజున, రాజ్ మాదిరాజు ఇంకో వీడియోను పోస్టు చేస్తూ, ముందు తీసిన వీడియో ఒక సోషల్ ఎక్స్పీరిమెంట్ అని, అది నిజం కాదు అని తెలిపారు. “తన కొడుకు నిజంగా రేపిస్ట్ అయి, అతను నిజంగా రేప్ చెయ్యలేదు అని నమ్మి ఒక తండ్రి తన డబ్బు మరియు పలుకుబడి ఉపయోగించి కొడుకును బైటికి తీసుకొచ్చాక ఆ కొడుకు రాత్రి వచ్చి నిజంగా నేను రేప్ చేశాను నాన్న అని అంటే దానికి తండ్రి కదిలిపోయి, తన కొడుకును ఎలాగైనా పోలీసులకు పట్టించాలి అన్న భావనతో ఒక తండ్రి ఎలా జడ్జీకి ఒక వీడియో రికార్డ్ చేసి రిలీస్ చేస్తాడో చూపిస్తూ నేను ఈ వీడియో చేశాను” అని వివరించారు. వీడియోలో వివరణ ఇస్తే ప్రజలలో ఈ ఎక్స్పీరిమెంట్ యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇది నిజమైన సంఘటన కాదు అనే హెచ్చరిక వీడియోలో ఇవ్వలేదు అని తెలిపారు. అంతే కాకుండా, తాను వీడియోలో ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ అనే పదాలను వాడినందువల్ల ఆ స్టేషన్ యొక్క పోలీసులకు ఈ సంఘటన గురించి ఆరా తీస్తూ చాలా ఫోన్లు వచ్చాయని దానికి క్షమాపణ అడుగుతున్నాను అని, ఈ వీడియో ఫేమ్ కోసం చేసింది కాదు అంటూ రాజ్ మాదిరాజు స్పష్టం చేసారు.
చివరిగా, సంజీవ రెడ్డి నగర్ ఆత్యాచార నిందుతుడి తండ్రి తన కొడుకును శిక్షించాలి అంటూ మాట్లాడిన వీడియో కల్పితం, నిజమైనది కాదు.