‘బైంసాలో అల్లర్ల ప్రత్యక్ష సాక్ష్యాలు’ అని చెప్తూ ఒక వీడియోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: తాజాగా భైంసా లో జరిగిన అల్లర్లకు సంబంధించిన వీడియో.
ఫాక్ట్ (నిజం): పోస్ట్ చేసిన వీడియో ఫిబ్రవరి-2018 నుండి ఇంటర్నెట్ లో ఉన్నట్టు చూడవొచ్చు. వీడియోలోని ఘటనకీ, తాజాగా భైంసాలో జరిగిన ఘర్షణలకు సంబంధం లేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే వీడియోని ఫిబ్రవరి -2018 లోనే ఒక వ్యక్తి యూట్యూబ్ లో పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అదే వీడియోని ఫేస్బుక్ లో కూడా ఫిబ్రవరి-2018 లోనే పోస్ట్ చేసినట్టు ఇక్కడ చూడవొచ్చు. ఇంతకు ముందు ఆ వీడియో గురించి చాలా మంది బెంగాలీ లో రాసి షేర్ చేసినట్టు చూడవొచ్చు. కానీ, ఆ వీడియోకి సంబంధించిన మరింత సమాచారం ఇంటర్నెట్ లో దొరకలేదు. పోస్ట్ చేసిన వీడియో ఫిబ్రవరి-2018 నుండి ఇంటర్నెట్ లో ఉంది కాబట్టి, దానికీ, తాజాగా భైంసా లో జరిగిన ఘర్షణలకు ఎటువంటి సంబంధం లేదు.
చివరగా, సంబంధం లేని పాత వీడియో పెట్టి, ‘భైంసాలో అల్లర్ల ప్రత్యక్ష సాక్ష్యాలు’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?