Fake News, Telugu
 

సంబంధం లేని ఫోటోలని కువైట్ కుబేరుడు నాజర్ అల్-ఖరాఫి మరణించక ముందు సంపాదించిన ఆస్తులని షేర్ చేస్తున్నారు

0

కువైట్ దేశపు కుబేరుడు నాజర్ అల్-ఖరాఫి మరణించక ముందు సంపాదించుకున్న ఆస్తులు చూడండి, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. వందల కోట్లు విలువ చేసే బంగారం, వజ్రాలు, ఖరీదైన వాహనాల ఫోటోలని ఈ పోస్టులో షేర్ చేసారు. అలాగే, ఒక సమాధి ఫోటోని షేర్ చేస్తూ అది నాజర్ అల్-ఖరాఫి సమాధి అని క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కువైట్ కుబేరుడు నాజర్ అల్-ఖరాఫి మరణించక ముందు సంపాదించిన ఆస్తుల ఫోటోలు.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటోలు కువైట్ దేశం కుబేరుడు నాజర్ అల్-ఖరాఫి కి సంబంధించినవి కావు. నాజర్ అల్-ఖరాఫి ఏప్రిల్ 2011 లో చనిపోయారు. ఈ పోస్టులో షేర్ చేసిన సమాధి ఫోటో గురించి ఖచ్చితమైన సమాచారం FACTLY కి దొరకలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ పోస్టులో తెలిపిన కువైట్ కుబేరుడి సమాచారం కోసం గూగుల్ లో వెతికితే,  నాజర్ అల్-ఖరాఫి అనే పేరు గల వ్యక్తి కువైట్ దేశానికి చెందిన ధనవంతులలో ఒకడని తెలిసింది. నాజర్ అల్-ఖరాఫి ఏప్రిల్ 2011 లో మరణించారు. 2011లో ఫోర్బ్స్ తెలిపిన సమాచారం ప్రకారం నాజర్ అల్-ఖరాఫి కుటుంబానికి $10.4 బిల్లియన్ డాలర్ల ఆస్తి ఉంది.

పోస్టులో షేర్ చేసిన ఫోటోల గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.

ఫోటో-1:

పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో లండన్ లోని బ్యాంక్ అఫ్ ఇంగ్లాండ్ కి సంబంధించిందని తెలిసింది. ఇదే దృశ్యాన్ని ‘BBC News’ ఛానల్ బ్యాంక్ అఫ్ ఇంగ్లాండ్ బంగారు లాకర్ల గురించి తెలుపుతూ పబ్లిష్ చేసిన వీడియోలో చూడవచ్చు.

ఫోటో-2:

ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటో ‘U.S. Customs and Border Protection’ అధికారిక వెబ్సైటులో దొరికింది.  ‘$3M in illicit currency seized by Border Patrol agents’ అని ఈ ఫోటో వివరణలో తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పబ్లిష్ చేసిన న్యూస్ ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు.

ఫోటో-3:

పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో National Geographic వెబ్సైటులో దొరికింది. ‘Stacks of gold bars fill a bank vault, Pretoria, South Africa’ అని ఈ ఫోటో వివరణలో తెలిపారు. అంతేకాదు, ఇదే ఫోటోని  ‘National Geographic Magazine scans’, on ‘Flickr’ ఆల్బం లో కూడా అప్లోడ్ చేసారు.

ఫోటో-4:

పోస్టులో షేర్ చేసిన ఇదే ఫోటోని ‘Swarovski Crystal Staircases on the MSC Fantasia’ అనే వివరణతో Flickr వెబ్సైటులో పబ్లిష్ చేసారు. ఈ ఫోటో యొక్క EXIF సమాచారాన్ని ఈ వెబ్సైటులో చూడవచ్చు. MSC Fantasia అనే ఈ క్రూజ్ షిప్ ని MSC Cruises అనే సంస్థ నడిపిస్తుంది. MSC Cruises కి సంబంధించిన మరింత సమాచారం ఇక్కడ చదవచ్చు.

ఫోటో-5:

ఈ ఫోటోలో బంగారు రంగులో కనిపిస్తుంది ‘Khalilah’ అనే పేరుతో పిలువబడే పడవ అని తెలిసింది. ఈ పడవని నాజర్ అలీ-ఖరాఫీ మరణించిన తరువాత నిర్మించారు. ఈ పడవకి నాజర్ అలీ-ఖరాఫీ కి ఎటువంటి సంబంధం లేదు. ఈ ‘Khalilah’ పడవకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

ఫోటో-6:

ఈ బంగారం రంగులో ఉన్న కారు ఫోటోని ‘West Coast Customs’ అనే ఫేస్బుక్ పేజి 2015లో పోస్ట్ చేసింది. ‘West Coast Customs’ ఈ కారుని ‘this Gold Rolls we built in 2015 for The Gumball 3000’ అని తెలుపుతూ పోస్ట్ చేసారు. దీనిబట్టి, ఈ ఫోటో నాజర్ అలీ-ఖరాఫీ మరణించిన తరువాత తీసినది అని చెప్పవచ్చు.

ఈ పోస్టులో షేర్ చేసిన కొన్ని ఫోటోల గురించి ఖచ్చితమైన సమాచారం తెలియనప్పటికి, మిగిలిన ఫోటోల సమాచారాన్ని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

పోస్టులో షేర్ చేసిన సమాధి ఫోటో ఎవరిదనే ఖచ్చితమైన సమాచారం మాకు దొరకలేదు. నాజర్ అలీ-ఖరాఫీ అంతక్రియల ఫోటోలని ఇక్కడ చూడవచ్చు.

నాజర్ అలీ-ఖరాఫీ అంతక్రియలు కువైట్ లోని ‘Sulaibikhat’ స్మశానవాటికలో లో జరిగినట్టు ఒక ఆర్టికల్ రిపోర్ట్ చేసింది. ఈ స్మశానవాటిక యొక్క  Google Street View ని ఇక్కడ చూడవచ్చు. నాజర్ అలీ-ఖరాఫీ యొక్క సమాధి ఫోటోలు మాత్రం మాకు దొరకలేదు.

చివరగా, సంబంధం లేని ఫోటోలని చూపిస్తూ కువైట్ కుబేరుడు నాజర్ అల్-ఖరాఫి మరణించక ముందు సంపాదించిన ఆస్తుల ఫోటోలని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll