థర్మాకోల్‌తో చెక్కర తయారు చేస్తున్నారని చెప్తూ, ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: వీడియోలో థర్మాకోల్‌తో చెక్కర తయారు చేస్తున్నారు.
ఫాక్ట్: వీడియోలో తయారు చేస్తున్నది చెక్కర కాదు. థర్మాకోల్‌ని రీసైకిల్ చేసి, ప్లాస్టిక్ గ్రాన్యూల్స్‌లోకి మారుస్తున్నారు. ఆ గ్రాన్యూల్స్‌తో వివిధ ప్లాస్టిక్ వస్తువులు తయారుచేయవచ్చు. ఇంతకముందు, ఇలాంటివే ప్లాస్టిక్ బియ్యం, గుడ్లు, మరియు చెక్కరపై వదంతులు వచ్చినప్పుడు, దేశంలో అలాంటి ఒక్క కేసు కూడా రుజువు కాలేదని 2017లో మంత్రి సీ.ఆర్. చౌదరి లోక్ సభలో తెలిపారు. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.
పోస్ట్‌లోని వీడియో యొక్క స్క్రీన్‌షాట్స్‌ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, అలాంటి కొన్ని వీడియోలు సెర్చ్ రిజల్ట్స్‌లో వచ్చాయి. ఒకరు యూట్యూబ్‌లో అదే వీడియోని పెట్టి, “Thermocol recycling plant” (థర్మాకోల్ రీసైక్లింగ్ ప్లాంట్) అని టైటిల్‌లో రాసినట్టు చూడవచ్చు.
ఆ కీ-వర్డ్స్‌తో ఇంటర్నెట్‌లో వెతకగా, థర్మాకోల్ రీసైక్లింగ్‌కి సంబంధించిన చాలా వీడియోలు వస్తాయి. ఆ వీడియోల్లో కూడా పోస్ట్‌లోని వీడియోలోని ప్రక్రియనే ఉంటుంది. థర్మాకోల్‌ని రీసైకిల్ చేసి, ప్లాస్టిక్ గ్రాన్యూల్స్‌లోకి మారుస్తున్నట్టు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు. ఆ గ్రాన్యూల్స్‌తో వివిధ ప్లాస్టిక్ వస్తువులు తయారుచేయవచ్చు.
ఇంతకముందు, ఇలాంటివే ప్లాస్టిక్ బియ్యం, గుడ్లు, మరియు చెక్కరపై వదంతులు వచ్చినప్పుడు, దేశంలో అలాంటి ఒక్క కేసు కూడా రుజువు కాలేదని 2017లో మంత్రి సీ.ఆర్. చౌదరి లోక్ సభలో తెలిపారు. ఆ జవాబుకి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చదవచ్చు. ప్లాస్టిక్ బియ్యం మరియు గుడ్లపై ఇంతకముందు వివిధ ఫేక్ పోస్టులపై FACTLY రాసిన ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చదవచ్చు.
చివరగా, వీడియోలో థర్మాకోల్‌తో చెక్కర తయారు చేయట్లేదు. థర్మాకోల్‌ని రీసైకిల్ చేస్తున్నారు.