Fake News, Telugu
 

‘అనంతపురంలో ప్లాస్టిక్ రైస్’ అంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు.

1

అనంతపురం లోని ఒక హోటల్ లో ఇచ్చిన అన్నాన్ని వీడియో తీసినట్టు చెప్తూ ‘అనంతపురంలో ప్లాస్టిక్ రైస్’ అని చాలా మంది ఫేస్బుక్ లో ఒక వీడియోని షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

పై వీడియోని 2017 లోనే పెట్టగా, ఇప్పట్టికీ ఆ వీడియోని షేర్ చేస్తున్నాటుగా చూడవొచ్చు. ఈ ఆర్టికల్ రాసే సమయానికి సుమారు 51 వేల మంది ఆ వీడియోని షేర్ చేసారు.

క్లెయిమ్: అనంతపురంలో ప్లాస్టిక్ రైస్

ఫాక్ట్ (నిజం): FSSAI వారు మార్కెట్ లో ప్లాస్టిక్ బియ్యం లభ్యం అవ్వడం గురించి వస్తున్న వార్తలను అవాస్తవాలుగా పేర్కొన్నారు. బియ్యం లో స్టార్చ్ మరియు కార్భోహైడ్రాట్స్ ఉండడం చేత వాటి మధ్య ఉండే బంధన మరియు అంటుకునే తత్వం వలన బియ్యం వండాక అన్నాన్ని ముద్దగా చేస్తే, అందులో ఉండిపోయిన గాలి వల్ల అది ఒక బంతి లాగా బౌన్స్ అవుతుంది అని వారు పేర్కొన్నారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

మన దేశం లోని వివిధ రాష్ట్రాల్లో ప్లాస్టిక్ బియ్యం లభించడం గురించి గత కొంత కాలంగా విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. కానీ, అనేక సందర్భాల్లో వాటిని ప్రభుత్వం మరియు FSSAI వారు ఫేక్ న్యూస్ గా పేర్కొన్నారు. FSSAI సంస్థ ప్లాస్టిక్ బియ్యం లభించడం గురించి వస్తున్న వార్తలను అవాస్తవాలుగా పేర్కొంటూ ఒక డాక్యుమెంట్ ని విడుదల చేసింది.

FSSAI సంస్థ బియ్యం యొక్క సహజ లక్షణాల గురించి తెలియజేస్తూ తన అధికారిక వెబ్సైటులో సమాచారాన్ని పెట్టింది. బియ్యం లో స్టార్చ్ మరియు కార్భోహైడ్రాట్స్ ఉండడం చేత వాటి మధ్య ఉండే బంధన మరియు అంటుకునే తత్వం వలన బియ్యం వండాక అన్నాన్ని ముద్దగా చేస్తే, అందులో ఉండిపోయిన గాలి వల్ల అది ఒక బంతి లాగా బౌన్స్ అవుతుంది అని అందులో పేర్కొన్నారు.

ఇంతకుముందు ఒకసారి కరీంనగర్ లోని ఒక సూపర్ మార్కెట్ లో కూడా ప్లాస్టిక్ రైస్ లభ్యం అయినట్టు వార్తలు వచ్చాయి. అప్పుడు, ప్లాస్టిక్ బియ్యం లభ్యం అవ్వడం గురించి కరీంనగర్ టౌన్-2 పోలీస్ వారిని FACTLY సంప్రదించగా, వారు కూడా ఆ విషయం లో ఎటువంటి నిజం లేదు అని తెలియజేసారు. కరీంనగర్ లో ప్లాస్టిక్ రైస్ దొరికినట్లు వచ్చిన ఫేక్ న్యూస్ పై FACTLY రాసిన ఫాక్ట్ చెక్ ఆర్టికల్ ఇక్కడ చదవొచ్చు.

చివరగా, ‘అనంతపురంలో ప్లాస్టిక్ రైస్’ అంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll