అయోధ్య విషయంలో కమ్యూనికేషన్ కి సంబంధించి కొత్త నియమాలు రేపటి నుండి వర్తిస్తాయి అంటూ సోషల్ మీడియాలో పన్నెండు నియమాలతో కూడిన మెసేజ్ ని చాలా మంది షేర్ చేస్తున్నారు. దాంట్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: అయోధ్య విషయంలో కమ్యూనికేషన్ కి సంబంధించి కొత్తగా పన్నెండు నియమాలు వర్తించనున్నాయి.
ఫాక్ట్ (నిజం): ‘అయోధ్య విషయంలో కమ్యూనికేషన్ కి సంబంధించి కొత్త నియమాలు వర్తిస్తాయి’ అంటూ సోషల్ మీడియా లో వస్తున్న వార్తలు ఒక పుకారు అని ఉత్తర్ ప్రదేశ్ పోలీసు వారు తెలియజేసారు. కావున, పోస్టులో చెప్పింది తప్పు.
ఫేస్బుక్ పోస్టులో పేర్కొన్న విషయాల గురించిన సమాచారం కోసం వెతికినప్పుడు, ఉత్తర్ ప్రదేశ్ పోలీసు వారు ఒక న్యూస్ పేపర్ క్లిప్ తో పెట్టిన ట్వీట్ లభించింది. అందులో, అయోధ్య లో అశాంతిని నెలకొల్పాలనే ఉద్దేశంతో, సోషల్ మీడియా లో కొన్ని తప్పుడు వార్తలు చలామణి అవుతున్నాయని యూపీ పోలీసు వారు పేర్కొన్నారు. వాటిలో ఒకటి, అయోధ్య విషయంలో కమ్యూనికేషన్ కి సంబంధించి కొత్త నియమాలు వర్తిస్తాయని తెలుపుతూ పన్నెండు నియమాలతో కూడిన మెసేజ్ అనీ, వాస్తవానికి అది కేవలం ఒక పుకారని యూపీ పోలీసు వారు తెలిపారు. అంతేకాదు, జిల్లా ప్రజలను ఉద్దేశించి సోషల్ మీడియా లో తప్పుడు ఫోటోలను, వీడియోలను, మెసేజ్ లను షేర్ చేయవద్దని తెలుపుతూ, ఎవరైనా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అయోధ్య పోలీస్ సైబర్ సెల్ వారు తెలిపారు.
మీరట్ పోలీసు వారు కూడా, ఆ మెసేజ్ లో ఉన్న పన్నెండు నియమాలలో సంఖ్యా నెం 1, 2 మరియు 5 తో ఉన్న విషయాలు తప్పని తెలిపారు.
చివరగా, ‘అయోధ్య విషయంలో కమ్యూనికేషన్ కి సంబంధించి కొత్త నియమాలు వర్తిస్తాయి’ అంటూ వస్తున్న వార్తలు తప్పు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: ‘అయోధ్య విషయంలో కమ్యూనికేషన్ కి సంబంధించి కొత్త నియమాలు వర్తిస్తాయి’ అంటూ వస్తున్న వార్త ఒక ప