Fake News, Telugu
 

టీచర్ల వాహనాల కోసం సుప్రీంకోర్టు ఎటువంటి ప్రత్యేక లోగోని ఆమోదించలేదు

0

సుప్రీంకోర్టు ఉపాధ్యాయుల కోసం ఒక ప్రత్యేక లోగోను ఆమోదించింది, అంటూ సోషల్ మీడియాలో ఒక లోగో ఫోటో షేర్ అవుతుంది. డాక్టర్లు, లాయర్లు మాదిరి టీచర్లు కూడా తమ వాహనాల పై ఈ ప్రత్యేక లోగోను పెట్టుకోవచ్చని అంటూ ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఈ లోగోకి సంబంధించి వాస్తవాలు తెలుపమని ఇటీవల FACTLY వాట్సాప్ టిప్‌లైన్ (+91 9247052470) నెంబర్‌కి పలువురు యూసర్లు మెసేజ్ చేసారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: సుప్రీంకోర్టు టీచర్ల కోసం ఒక ప్రత్యేక లోగోను ఆమోదించింది.

ఫాక్ట్ (నిజం): ఈ లోగో పై PIB స్పష్టతనిస్తూ 06 ఫిబ్రవరి 2020 నాడు ట్వీట్ చేసింది. సుప్రీంకోర్టు టీచర్ల కోసం ఎటువంటి ప్రత్యేక లోగోను ఆమోదించలేదని PIB ఈ ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది. ఈ లోగోకు సంబంధించిన ఎటువంటి సమాచారం సుప్రీంకోర్టు వెబ్సైటులో కూడా లభించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన లోగోకు సంబంధించిన వివరాల కోసం గుగూల్‌లో వెతికితే, ఈ లోగో పై PIB స్పష్టతనిస్తూ 06 ఫిబ్రవరి 2020 నాడు ట్వీట్ చేసినట్టు తెలిసింది. టీచర్లు తమ కార్లపై పెట్టుకోవడం కోసం సుప్రీంకోర్టు ఎటువంటి ప్రత్యేక లోగోను ఆమోదించలేదని PIB ఈ ట్వీట్లో స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఈ న్యూస్ ఫేక్ అని PIB స్పష్టం చేసింది.

అంతేకాదు, సుప్రీంకోర్టు వెబ్సైటులో ‘teachers logo’ అనే పదాలు ఉపయోగించి ఫ్రీ టెక్స్ట్ ఫిల్టర్ చేసినప్పుడు, మాకు ఎటువంటి సెర్చ్ రిజల్ట్స్ లభించలేదు. దీన్ని బట్టి, సుప్రీంకోర్టు టీచర్లకు ప్రత్యేక లోగోను ఆమోదిస్తు ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టమయ్యింది.

సుప్రీంకోర్టు టీచర్ల కోసం ప్రత్యేక లోగోను ఆమోదించినట్టు ఇంటర్నెట్లో ఏ ఒక్క న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ అవ్వలేదు. కేవలం, ‘Hindustan Times’ న్యూస్ సంస్థ, ఈ ఫేక్ లోగోకు సంబంధించి PIB ఫాక్ట్-చెక్ ఇచ్చిన స్పష్టతను రిపోర్ట్ చేస్తూ 2020 ఫిబ్రవరి నెలలో ఆర్టికల్ పబ్లిష్ చేసింది.

పోస్టులో షేర్ చేసిన లోగో ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే లోగో ఫోటోని ‘Teacher Logo’ అనే ఫేస్‌బుక్ గ్రూప్ లో షేర్ చేసినట్టు తెలిసింది. ఈ లోగోకి సంబంధించిన మరింత సమాచారం కోసం ఫేస్‌బుక్‌లో వెతికితే, ఈ లోగోని ‘Rajesh Khanna’ అనే ఫేస్‌బుక్‌ యూసర్ మొట్టమొదటగా షేర్ చేసినట్టు తెలిసింది. ఈ లోగోని తానే రూపొందించినట్టు ‘Rajesh Khanna’ తన ఫేస్‌బుక్‌ పేజీలో పేర్కొన్నారు. అయితే, ‘Rajesh Khanna’ ఈ లోగోని రూపొందించారా లేదా అనే విషయాన్ని మేము దృవికరించలేకపోయాము. ఈ  వివరాల ఆధారంగా సుప్రీంకోర్టు టీచర్లకు ప్రత్యేక లోగోని ఆమోదించలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, టీచర్ల వాహనాల కోసం సుప్రీంకోర్టు ఎటువంటి ప్రత్యేక లోగోని ఆమోదించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll