Fake News, Telugu
 

ఇస్రో భూములకు నెహ్రూ స్టాంప్ డ్యూటీ మినహాయింపు నిరాకరించాడు అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు

0

ఇటీవల చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయిన నేపథ్యంలో ఇస్రో చరిత్రకు సంబంధించి అనేక వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మైసూర్ మహారాజు ఇస్రోకు నాలుగు వేల ఎకరాల దానం చేసేలా జనసంఘ్ మహానేత దీన దయాల్ మహారాజు ఒప్పించాడని, కాని నెహ్రూ మాత్రం ఈ భూములకు స్టాంపు డ్యూటీ మినహాయింపు ఇవ్వడానికి మాత్రం ఒప్పుకోలేదన్న వార్త ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వార్తఓ నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: మైసూర్ మహారాజు ఇస్రోకు నాలుగు వేల ఎకరాల దానంగా ఇచ్చిన భూమికి స్టాంపు డ్యూటీ మినహాయింపు ఇవ్వడానికి నెహ్రూ అంగీకరించలేదు.

ఫాక్ట్(నిజం): భారత అంతరిక్ష పరిశోదలనకు సంబంధించి 1962లో భారత ప్రభుత్వం ఏర్ర్పాటు చేసిన ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ (INCOSPAR) ఆ తదనంతరం 1969లో ఇస్రోగా రూపాంతరం చెందింది. ఐతే ఇస్రో భూములకు నెహ్రూ స్టాంప్ డ్యూటీ మినహాయింపు నిరాకరించాడనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

1964లో చనిపోయిన నెహ్రూకు 1969లో ఇస్రోను ఏర్పాటు చేయడంలో ఎలాంటి పాత్ర లేదని ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్టులో వాదిస్తున్నారు. ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇస్రో కన్నా ముందు భారత అంతరిక్ష పరిశోదలనకు సంబంధించి ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ (INCOSPAR) పేరుతో ఒక సంస్థ ఉండేది. దీనిని 1962లో భారత ప్రభుత్వ సహకారంతో విక్రం సారాభాయ్ ఏర్పాటు చేసారు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ).

ఆ తరవాత ఈ సంస్థనే కొన్ని అదనపు భాద్యతలతో 1969లో ఇస్రోగా రూపాంతరం చెందింది. దీన్నిబట్టి ఇస్రో ఏర్పాటులో 1962లో ప్రధాని అయిన నెహ్రూ పాత్ర ఉందని స్పష్టమవుతుంది.

ఇక ఇస్రోకు మైసూరు రాజు నాలుగు వేల ఎకరాలు దానం చేసిన విషయానికి వస్తే, మైసూర్ మహారాజు, కృష్ణరాజ వడయార్ IV, బెంగళూరులో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) ఏర్పాటు కోసం 370 ఎకరాలకు పైగా భూమిని విరాళంగా ఇచ్చారు. ఈ క్రమంలోనే 1909లో ఈ సంస్థ ఏర్పడింది.

బహుశా ఈ విషయాన్నే మైసూర్ రాజు ఇస్రోకు భూమి విరాళంగా అందించాడని అనుకొని ఉంటారు. కానీ మైసూర్ రాజు ప్రత్యేకించి ఇస్రోకు భూమి విరాళంగా ఇచ్చాడనదానికి మాకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. అలాగే మైసూర్ రాజు IIScకి భూమి విరాళంగా ఇవ్వడంలో జనసంఘ్ నేత దీన దయాల్ పాత్ర ఉన్నట్టు గానీ, ఆ భూములకు నెహ్రూ స్టాంప్ డ్యూటీ మినహాయింపు నిరాకరించాడనడానికి మాకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఒకవేళ ఇలా నిజంగా జరిగి ఉంటే దీనికి సంబంధించిన రికార్డ్స్ గాని వార్తా కథనాలుగాని ఉండేవి, కాని అలాంటివేవి మాకు కనిపించలేదు.

చివరగా, ఇస్రో భూములకు నెహ్రూ స్టాంప్ డ్యూటీ మినహాయింపు నిరాకరించాడు అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు

Share.

About Author

Comments are closed.

scroll