Fake News, Telugu
 

బ్రెజిల్ దేశంలో ప్రతి 1000 మంది అమ్మాయిలకు 250 మంది అబ్బాయిలు మాత్రమే ఉన్నారు అనేది అవాస్తవం

0

బ్రెజిల్లో ప్రతి 1000 మంది అమ్మాయిలకి కేవలం 250 అబ్బాయిలు మాత్రమే ఉన్నారు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అసలు ఈ సమాచారంలో ఎంత వాస్తవం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొందాం. 

క్లెయిమ్: బ్రెజిల్లో 1000 మంది అమ్మాయిలకు కేవలం 250 అబ్బాయిలు మాత్రమే ఉన్నారు.

ఫాక్ట్(నిజం): ఏదైనా దేశంలో స్త్రీలకి పురుషులకి మధ్య జనాభా నిష్పత్తి/రేషియోని తెలిపే గణాంకాన్ని ‘లింగ నిష్పత్తి/సెక్స్ రేషియో అని అంటారు. బ్రెజిల్ దేశపు సంస్థ Brazilan Institute of Geography and Statistics (IBGE) ప్రకారం ఆ దేశంలో ప్రతి 1000 మంది అమ్మాయిలకి 956 మంది అబ్బాయిలు ఉన్నారు, 250 కాదు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

క్లెయిమ్ యొక్క వాస్తవికతను పరిశీలించటానికి బ్రెజిల్ దేశపు సెక్స్ రేషియో ( స్త్రీ పురుషుల జనాభా నిష్పత్తి) తెలుసుకోవటానికి తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో సెర్చ్ చేసాము. ఈ సెర్చ్ ద్వారా బ్రెజిల్ దేశపు అధికారిక ప్రభుత్వ సంస్థ అయిన Brazilan Institute of Geography and Statistics (IBGE) చేపట్టిన Continuous National Household Sample Survey, 2022 యొక్క డేటా ప్రకారం, బ్రెజిల్లో ప్రతి 1000 మంది అమ్మాయిలకి 956 మంది అబ్బాయిలు ఉన్నారు అని తెలిసింది (ఇది కుడా చదవండి).

ఇదే విషయాన్ని రిపోర్టు చేస్తూ CNN ప్రచురించిన కథనాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. వైరల్ పోస్టులో చెప్తున్న దానికి విరుద్ధంగా బ్రెజిల్లో ప్రతి 1000 మంది అమ్మాయిలకు 956 మంది అబ్బాయిలు ఉన్నారు, 250 మంది కాదు. ఇంతే కాక, IBGE డేటా ప్రకారం గతంలో (1980 నుండి 2010) ఎప్పుడు కూడా 1000 మంది అమ్మాయిలకు 250 మంది అబ్బాయిలు లేరు. 

చివరిగా, బ్రెజిల్లో ప్రతి 100 మంది అమ్మాయిలకు 250 మంది అబ్బాయిలు ఉన్నారు అని అవాస్తవ ప్రచారం చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll