Fake News, Telugu
 

హిట్లర్ పిల్లలతో ఉన్న ఫోటో, హిట్లర్ చేతిపై పక్షి ఉన్న ఫొటో ఎడిట్ చేయబడినవి

0

జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్‌ లాగానే భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా అచ్చం అదే తరహాలో పిల్లలతో, పక్షులతో, జంతువులతో ఫొటోలు దిగారని చెప్తూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ప్రధాని మోదీ అచ్చం హిట్లర్ లాగానే పిల్లలతో, పక్షులతో ఫొటోలు దిగారు.

ఫాక్ట్: హిట్లర్ పిల్లలతో ఉన్న ఫోటో మరియు హిట్లర్ చేతిపై పక్షి ఉన్న ఫొటో ఎడిట్ చేయబడినవి. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ఫోటో 1:

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ప్రధాని మోదీ కలబురగిలో (గుల్బర్గా) ముల్ల కంచె అవతల ఉన్న పిల్లలను కలవడం జరిగింది. అయితే హిట్లర్ కూడా అలాగే ముల్ల కంచె అవతల ఉన్న పిల్లలను కలుస్తున్నట్లు ఉన్న ఫొటోని దీనితో పోలుస్తున్నారు. అయితే ఈ ఫోటో అసలైనది కాదు. ముల్ల కంచె అవతల పిల్లలు ఉన్న ఫోటో 1945లో నాజీ కాన్సంట్రేషన్ క్యాంపు నుంచి వాళ్ళని రక్షిస్తున్నప్పుడు తీసినది. అలాగే, హిట్లర్ ఫోటో 1937లో వేరే ప్రదేశంలో తీసినది. ఈ రెండు ఫోటోలను కలిపి హిట్లర్ ముల్ల కంచె అవతల ఉన్న పిల్లలను కలుస్తున్నట్లు ఎడిట్ చేశారు.

ఫోటో 2:

2020లో గుజరాత్లో ఉన్న ఒక పక్షుల సంరక్షణ కేంద్రంలో మోదీ చేతిపై చిలుక ఉన్న ఫొటోని హిట్లర్ చేతిపై పక్షి ఉన్న ఫోటోతో పోల్చారు. అయితే హిట్లర్ చేతిపై పక్షి ఉన్న ఫోటో నిజమైనది కాదు. అది కూడా ఎడిట్ చేయబడిందే. నిజమైన ఫోటోని ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, ఎడిట్ చేయబడ్డ హిట్లర్ ఫొటోలను షేర్ చేస్తూ ప్రధాని మోదీ అచ్చం హిట్లర్ లాగానే ఫొటోలు దిగారంటూ తప్పుడు ప్రచారం జరుగుతుంది.  

Share.

About Author

Comments are closed.

scroll