Fake News, Telugu
 

ఈ ఫోటోలో ఉన్న ముగ్గురు IPS ఆఫీసర్స్ ఒకే కుటుంబానికి చెందినవారు కాదు, వీరు కేవలం ఒకే బ్యాచ్ కి చెందిన వారు

0

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు(ఇద్దరు సోదరులు,ఒక సోదరి) IPSకి సెలెక్ట్ అయ్యారు అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు(ఇద్దరు సోదరులు,ఒక సోదరి) IPSకి సెలెక్ట్ అయ్యారు.

ఫాక్ట్(నిజం): పోస్టులోని ఫోటోలో ఉన్న ముగ్గురు పూజ వశిస్ట్, తుషార్ గుప్తా, శ్రుతకీర్తి సోమవంశి IPSకి సెలెక్ట్ అయ్యారు. కానీ, వీరు ముగ్గురు సోదరి, సోదరులు కాదు, కేవలం ఒకే బ్యాచ్ కి చెందిన వారు. ఇదే విషయమై వివరణ కోసం మేము తుషార్ గుప్తాని సంప్రదించగా తను కూడా ఫోటోలో తనతోపాటు ఉన్నది తన బ్యాచ్మేట్స్ అని చెప్పాడు. శ్రుతకీర్తి సోమవంశి తను నిర్వహించే పాపులర్ ఇన్స్టాగ్రామ్ ఎకౌంటు అయిన ‘upscmeme’ లో కూడా ఇదే విషయాన్ని ద్రువీకరించాడు.కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా పోస్టు లోని ఫోటోలో కనిపించే అమ్మాయి ఇదే ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంటులో షేర్ చేసిన పోస్ట్ మాకు కనిపించింది. ఈ ఎకౌంటులోని బయో ప్రకారం ఈ అమ్మాయి పేరు పూజ వశిస్ట్, ఈమె ఒక IPS ప్రొబేషనర్. ఐతే ఈ పోస్టులో ట్యాగ్ చేసిన దాని ప్రకారం ఫోటోలో తనకు ఎడమ వైపు కూర్చున్నది తుషార్ గుప్తా, ఇంకా కుడి వైపు కూర్చున్నది శ్రుతకీర్తి సోమవంశి. వీరిద్దరు కూడా IPS ప్రొబేషనర్లే. తుషార్ గుప్తా కూడా ఇదే ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన పోస్ట్ ఇక్కడ చూడొచ్చు.

పోస్టు ద్వారా షేర్ అవుతున్న వార్త గురించి వివరణ కోసం మేము తుషార్ గుప్తాని సంప్రదించగా, ఆ ఫోటోలో తనతో పాటు ఉన్నది తన బ్యాచ్మేట్స్ అని, సోదరి, సోదరులం కాదని ద్రువీకరించాడు.

శ్రుతకీర్తి సోమవంశి ఇన్స్టాగ్రామ్ బయో ప్రకారం ‘upscmeme’ అనే పాపులర్ ఇన్స్టాగ్రామ్ ఎకౌంటు నిర్వహించేది తనే అని తెలిసింది. ఐతే  upscmeme ఎకౌంటు ద్వారా సోమవంశి, వైరల్ అవుతున్న ఫోటోలో తనతోపాటు ఉన్నది తన బ్యాచ్మేట్స్ అని ద్రువీకరించాడు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖకి చెందిన IPS వెబ్సైటు లో ఉన్న సమాచారం ప్రకారం UP(హోం స్టేట్)కి చెందిన శ్రుతకీర్తి సోమవంశికి మధ్యప్రదేశ్ కాడర్ కేటాయించారు, పూజ వశిస్ట్ కి తన హోం స్టేట్ అయిన హర్యానా కాడర్ కేటాయించారు, ఇంకా తుషార్ గుప్తాకి కూడా తన హోం స్టేట్ అయిన పంజాబ్ కాడర్ కేటాయించారు. వేరు వేరు ఇంటి పేర్లు, వేరు వేరు రాష్ట్రాలకి చెందిన వారు కాబట్టి వాళ్ళు ఒకే కుటుంబానికి సంబందించిన వారు కాదని కచ్చితంగా చెప్పొచ్చు.

చివరగా, పోస్టులోని ఫోటోలో ఉన్న ముగ్గురు బ్యాచ్మేట్స్, సోదరి, సోదరులు కాదు.

Share.

About Author

Comments are closed.

scroll