Fake News, Telugu
 

ఫొటోలో కంగనా రనౌత్ తో ఉన్నది ఒక ఫిలిం జర్నలిస్ట్, అండర్ వరల్డ్ డాన్ అబూ సలీం కాదు

0

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముంబై అండర్ వరల్డ్ డాన్ అబూ సలీం తో కలిసి మందు తాగుతున్న దృశ్యం అంటూ షేర్ చేస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ముంబై అండర్ వరల్డ్ డాన్ అబూ సలీం తో కంగనా రనౌత్ దిగిన ఫోటో.

ఫాక్ట్ (నిజం):  ఫోటోలో కంగనా రనౌత్ తో కలిసి తాగుతున్న వ్యక్తి ఫిలిం జర్నలిస్ట్ మార్క్ మాన్యువల్, అండర్ వరల్డ్ డాన్ అబూ సలీం కాదు. ఈ ఫోటో 2017లో కంగనా రనౌత్ నటించిన ‘సిమ్రాన్’ చిత్ర విడుదలకు సంబంధించిన వేడుకలలో తీసిన ఫోటో. ఈ ఫోటోకి అండర్ వరల్డ్ డాన్ అబూ సలీం కి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులోని ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అదే ఫోటోని షేర్ చేస్తూ మార్క్ మాన్యువల్ అనే ఫిలిం జర్నలిస్ట్ ‘HUFFPOST’ వెబ్సైటులో రాసిన ఆర్టికల్ దొరికింది. ఈ ఆర్టికల్ ‘Kangana Ranaut Should Realise That She Is Too Talented To Milk Her Personal Life For Attention’ అనే టైటిల్ తో ఈ వెబ్సైటులో పబ్లిష్ చేసారు. ఆర్టికల్ లో ఈ ఫోటో క్రెడిట్స్ జర్నలిస్ట్ మార్క్ మాన్యువల్ కే ఇచ్చారు.

ఈ ఫోటోని 2017 లో మార్క్ మాన్యువల్ తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేసారు. కంగనా రనౌత్ నటించిన ‘సిమ్రాన్’ చిత్రం విడుదల సందర్బంగా, ముంబై ఖార్ ప్రాంతంలోని ‘The Korner House’ రెస్టారెంట్ లో జరిగిన వేడుకలలో కంగనా తో దిగిన ఫోటో అని మార్క్ మాన్యువల్ ఈ పోస్టులో తెలిపారు. ఈ ఫోటోని మార్క్ మాన్యువల్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో కూడా షేర్ చేసారు.

చివరగా, ఫొటోలో కంగనా రనౌత్ తో కలిసి తాగుతున్న వ్యక్తి ఫిలిం జర్నలిస్ట్ మార్క్ మాన్యువల్, అండర్ వరల్డ్ డాన్ అబూ సలీం కాదు.

Share.

About Author

Comments are closed.

scroll