Fake News, Telugu
 

ఎడిట్ చేసిన వీడియోని షేర్ చేస్తూ రజనీకాంత్ దేవుని (యేసు) ఉనికి గురించి మాట్లాడినట్లు షేర్ చేస్తున్నారు

0

థామస్ ఆల్వా ఎడిసన్ మరియు ఇంకొక శాస్త్రవేత్త మధ్య జరిగిన సంఘటనకు సంభంధించిన కథను గురుంచి రజనీకాంత్ చేసిన ప్రసంగం ఒక్క వీడియోని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ వీడియో చివరిలో రజనీకాంత్ మాట్లాడుతూ, ‘సృష్టి ఉన్నప్పుడు, సృష్టికర్త ఉంటాడు. సృష్టికర్త లేకుండా, సృష్టి లేదు – కాబట్టి దేవుడు ఉన్నాడు’ అని అన్నారు. ఈ పోస్ట్ యొక్క టైటిల్ ‘Actor Rajinikanth about( God) Jesus (Telugu Dubbed తెలుగులో ) ఉన్నాడా లేడా ? రజనీ మాటల్లో !’ రజనీకాంత్ యేసు ఉన్నాడు అని వీడియోలో చెప్పినట్లు సూచించే విధంగా ఉంది. ఈ పోస్టులోని నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: రజనీకాంత్ దేవుడు (యేసు) యొక్క ఉనికిని తన ప్రసంగంలో థామస్ ఆళ్వా ఎడిసన్ కథ ద్వారా తెలియచేసారు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో ఉన్న వీడియో, ఎస్ రామకృష్ణన్ అనే తమిళ రచయితకు ‘ఇయల్ అవార్డు’ వచ్చిన సందర్భంగా, చెన్నైలో జరిగిన సన్మాన సభలో రజినీకాంత్ మాట్లాడిన ప్రసంగానిది. ఈ  మూడు నిమిషాల నాలుగు సెకన్ల వీడియో, తన 20 నిమిషాల స్పీచ్‌లోని చిన్న భాగం. థామస్ ఆల్వా ఎడిసన్‌కి, మరొక శాస్త్రవేత్తకు మధ్య జరిగిన సంఘటన యొక్క కథ ఆయన చెప్పారు, కథ  చివరిలో  ‘సృష్టి ఉన్నప్పుడు, సృష్టికర్త ఉంటాడు. సృష్టికర్త లేకుండా, సృష్టి లేదు – కాబట్టి దేవుడు ఉన్నాడు’ అని థామస్ ఎడిసన్ అన్నట్లు చెప్పారు. పోస్టులోని వీడియో ఇక్కడితో  ముగిసిపోతుంది, పూర్తి వీడియోలో, రచయితల గొప్పతనం గూర్చి మాట్లాడుతూ ‘ఈ కథ రాసిన రచయిత తాను దేవుడు ఉన్నాడు అని చెప్పదలచుకున్నారు, దాని కోసం థామస్ ఆళ్వా ఎడిసన్‌ని, ఇంకో శాస్త్రవేత్తని పాత్రలుగా తీస్కొని, ఒక పరిస్థితిని సృష్టించి, ఎడిసన్ ద్వారా ఆ మాట చెప్పించారు’ అని అన్నారు. పోస్టులో రజినీకాంత్ దేవుడు (యేసు) ఉన్నాడు అని చెప్పినట్లు ఉంది, ఆ భావన కలిగించేలాగా పూర్తి వీడియోలోని ఒక చిన్న భాగాన్ని ఎడిట్ చేసి అసందర్భంగా వీడియోను షేర్ చేస్తున్నారు. అంచేత పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్టులోని రజనీకాంత్ స్పీచ్‌ని తెలుగులోకి డబ్బింగ్ చేసిన వీడియో ఉంది, పూర్తి వీడియో కొరకు మేము సరైన కీ వర్డ్స్ ద్వారా ఇంటెర్నెట్‌లో వెతుకగా, ‘స్పిరిట్యుయల్ విప్’ అనే బ్లాగులో లభించింది, ఈ వీడియో తమిళ భాషలో ఉంది. ఎస్ రామకృష్ణనన్ అనే తమిళ రచయితకు కెనడాకి చెందిన తమిళ్ లిటరరీ గార్డెన్ అనే సంస్థ వారు 2011లో ఇయల్ అవార్డుని బహుకరించారు.

ఆ సందర్భంగా చెన్నైలో ఆయనకు సత్కారం  జరిగింది, ఈ సభకు రజనీకాంత్ కుడా వచ్చారు. ఆ సభకు సంభందించి అనేక మీడియా వెబ్సైటులలో ప్రచురితమైన చిత్రాలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ సభ  యొక్క పూర్తి వీడియోని ఇక్కడ చూడవచ్చు. బిహైండ్ వుడ్స్ టీవీ వారు, రజనీకాంత్ యొక్క  స్పీచ్‌ని రెండు భాగాలుగా అప్లోడ్ చేసారు, నిడివి సుమారు 20 నిమిషాలు.

పోస్టులో ఉన్న వీడియో నిడివి  మూడు నిమిషాల నాలుగు సెకన్లు మాత్రమే, రజినీకాంత్  తన ప్రసంగంలో రచయితల యొక్క  గొప్పతనాన్ని గురించి, పుస్తకాలు చదవడం ఎందుకు అవసరం మరియు పుస్తకాలు ఎలా మనుషులపై ప్రభావం చూపుతాయి, ఎస్ రామకృష్ణన్ గారితో ఆయనకు ఉన్న పరిచయం, ఆయన ఒక్క గొప్పతనం, ఇలా చాలా విషయాల గురించి మాట్లాడారు. థామస్ ఆల్వా ఎడిసన్‌కి మరొక శాస్త్రవేత్తకు మధ్య జరిగిన సంఘటన యొక్క కథను చెప్తూ  ఆ కథ చివరిలో ఎడిసన్ మరొక శాస్త్రవేత్తతో మాట్లాడుతూ, శాస్త్రవేత్తలు ఈ విశ్వం హఠాత్తుగా ఏర్పడిపోయింది అని అంటారు.. .  ‘సృష్టి ఉన్నప్పుడు, సృష్టికర్త ఉంటాడు. సృష్టికర్త లేకుండా, సృష్టి లేదు – కాబట్టి దేవుడు ఉన్నాడు’ అని అన్నట్లు  రజనీకాంత్ చెప్పారు.  పోస్టులోని వీడియో ఇక్కడితో  ముగిసిపోతుంది.

పూర్తి వీడియోలో, రజనీకాంత్ రచయితల గొప్పతనం గూర్చి మాట్లాడుతూ ‘ఈ కథ రాసిన రచయిత తాను దేవుడు ఉన్నాడు అని చెప్పదలచుకున్నారు, దాని కోసం థామస్ ఆళ్వా ఎడిసన్‌ని ఇంకో శాస్త్రవేత్తని పాత్రలుగా తీస్కొని, ఒక పరిస్థితిని సృష్టించి ఎడిసన్ ద్వారా ఆ మాట చెప్పించారు’ అని అన్నారు. పోస్టులో రజనీకాంత్ దేవుడు (యేసు) ఉన్నాడు అని వీడియోలో చెప్పినట్లు ఉంది, ఆలా  అనిపించే విధంగా పూర్తి వీడియోలోని చిన్న భాగాన్ని ఎడిటి చేసి అసందర్భంగా వీడియోను షేర్ చేస్తున్నారు. అంచేత పోస్టు తప్పుదోవ పట్టించేలా ఉంది.

చివరిగా, ఎడిట్ చేసిన వీడియోని పెట్టి రజనీకాంత్ దేవుని (యేసు) ఉనికి గురించి మాట్లాడినట్లు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll