Fake News, Telugu
 

ఈ వీడియోలో హాస్పిటల్ లిఫ్ట్‌లోకి ఎక్కుతూ కనిపిస్తుంది మహేష్ బాబు కాదు, అతని అల్లుడు అశోక్ గల్లా

0

‘సూపర్ స్టార్ కృష్ణ తుది శ్వాస విడిచే సమయంలో హాస్పిటల్ కు పరుగులు పెట్టిన మహేష్ బాబు.’ అని చెవుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఇందులోని నిజానిజాలు ఎంతో ఈ పోస్టు ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్:  సూపర్ స్టార్ కృష్ణ తన తుది శ్వాస పీల్చే సమయంలో మహేష్ బాబు పరుగెత్తుకుంటూ హాస్పిటల్ చేరుకున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అశోక్ గల్లా, అతను మహేష్ బాబు అల్లుడు. ఇతను గుంటూరు ఎంపీ, గల్లా జయదేవ్ కుమారుడు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వీడియోలో వినిపిస్తున్న మాటలని సరిగ్గా గమనిస్తే, పేరేమో అశోక్ గల్లా అని స్క్రీన్ వెనకనుండి చెప్తున్నట్లు అర్ధం అవుతుంది. దీని ఆధారంగా ఇంటర్నెట్ లో వెతకగా, పోస్టులో ఉన్న వీడియో యొక్క పూర్తి వెర్షన్ దొరికింది. సుమన్ టివీ అనే యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసిన ఈ వీడియో 1:05 నిమిషాల నిడివి కలిగి ఉంది. ఇటువంటి మరొక వీడియోని ఇక్కడ చూడవొచ్చు. ఇకపోతే, మహేష్ బాబు కృష్ణని హాస్పిటల్ లో చూడటానికి వెళ్లినప్పటి దృశ్యాలు ఇక్కడ చూడవచ్చు.

అశోక్ గల్లా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు, మహేష్ బాబుకి అల్లుడు వరస అవుతాడు. తాను నటించిన మొదటి చిత్రం ‘హీరో’ జనవరి 2022న విడులైంది. అశోక్ గల్లా గురించి మరిన్ని వివరాలు తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా తెలుసుకోవచ్చు.

చివరిగా, ఈ వీడియోలో హాస్పిటల్ లిఫ్ట్‌లోకి ఎక్కుతూ కనిపిస్తుంది మహేష్ బాబు కాదు, అతని అల్లుడు అశోక్ గల్లా.

Share.

About Author

Comments are closed.

scroll