కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోదీని పోగుడుతున్నాడంటూ ఒక వీడియోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోదీని పోగుడుతున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో మోదీని పోగుడుతున్నది ఫస్ట్ ఇండియా న్యూస్ ఎడిటర్, చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన జగదీష్ చంద్ర. ఈయనకి, కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధంలేదు. ఒక మీడియా సమావేశంలో విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ జగదీష్ చంద్ర ఈ వ్యాఖ్యలు చేసారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వీడియోలో మోదీని పొగుడుతున్నది ఫస్ట్ ఇండియా న్యూస్ ఎడిటర్, చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన జగదీష్ చంద్ర. ఆయనకి, కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధంలేదు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లో కాశీ-విశ్వనాథ్ కారిడార్‌ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జరిగిన ఒక మీడియా సమావేశంలో నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ గురుంచి ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ జగదీష్ చంద్ర ఈ వ్యాఖ్యలు చేసారు.
వైరల్ వీడియోలో ఫస్ట్ ఇండియా న్యూస్ లోగో స్పష్టంగా కనిపిస్తుంది, దీని ఆధారంగా యూట్యూబ్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా, వైరల్ క్లిప్ యొక్క పూర్తి నిడివి గల వీడియో మాకు లభించింది. ఈ వీడియోలో 1.02 నిముషాల వద్ద వైరల్ వీడియోలో మోదీని పొగుడుతున్న వ్యక్తిని ఫస్ట్ ఇండియా న్యూస్ ఎడిటర్ మరియు చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన జగదీష్ చంద్ర అని పరిచయం చేయడం చూడొచ్చు.

జగదీష్ చంద్రకి కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉన్నట్టు మాకు ఎటువంటి సమాచారం లభించలేదు. గతంలో జగదీష్ చంద్ర మోదీపై చేసిన విశ్లేషణ ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఇండియా న్యూస్ మరియు జగదీష్ చంద్రకి సంబంధించిన వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు.
చివరగా, ఈ వీడియోలో మోదీని పోగుడుతుంది ఫస్ట్ ఇండియా న్యూస్ ఎడిటర్ జగదీష్ చంద్ర, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు.