Fake News, Telugu
 

ఈ వీడియోలో డాన్స్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ AAG పొన్నవోలు సుధాకర్ రెడ్డి కాదు

0

ఒక వ్యక్తి డాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేస్తూ, ఇది 2016లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్  రెడ్డి డాన్స్ చేసిన వీడియో అని ఆరోపిస్తున్నారు.  ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి డాన్స్ చేస్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియోలో ఉంది సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా ఫేమస్ అయిన పబ్బ సైదులు అనే వ్యక్తి. ఈ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో అప్లోడ్ చేయబడింది. కావున ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

ఈ వీడియోను కింద ఉన్న కామెంట్స్ లో, ఒక వ్యక్తి వీడియోలో ఉన్నతని పేరు పబ్బ సైదులు అని తెలిపాడు. దాన్ని ఆధారంగా తీసుకొని ఇంటర్నెట్లో వెతికితే పబ్బ సైదులు అనే వ్యక్తి యొక్క వీడియోలు సోషల్ మీడియాలో లభించాయి (ఇక్కడ మరియు ఇక్కడ). పోస్టులో షేర్ చేసిన వీడియో గురించి వెతకగా, ఇది 5 సెప్టెంబర్ 2023న  సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన రీల్  వీడియో, 2016లోనిది కాదు అని స్పష్టమైంది.

వైరల్ వీడియోలో ఉన్న సైదులు, ఆంధ్రప్రదేశ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పోలుస్తున్న ఫోటోను కింద చూడవచ్చు.

చివరిగా, ఈ వీడియోలో డాన్స్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ AAG పొన్నవోలు సుధాకర్ రెడ్డి కాదు.

Share.

About Author

Comments are closed.

scroll