Fake News, Telugu
 

ఈ వీడియోలో అమ్మాయిని చంపుతున్న వ్యక్తి ముస్లిం మతస్థుడు కాదు; ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు

0

సూరత్‌లో ఒక హిందూ బాలికను పట్టపగలు ఒక ముస్లిం కత్తితో నరికి చంపాడు, ఆ హిందూ అమ్మాయి ముస్లింగా మారడానికి నిరాకరించింది”, అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: సూరత్‌లో ఒక హిందూ బాలికను పట్టపగలు ఒక ముస్లిం కత్తితో నరికి చంపుతున్న వీడియో.

ఫాక్ట్: వీడియోలోని ఘటన గుజరాత్‌లో జరిగిన మాట వాస్తవమే. కానీ, వీడియోలో అమ్మయిని చంపిన వ్యక్తి ముస్లిం మతస్థుడు కాదు. అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ ఒకే సామజిక వర్గానికి (‘గుజరాతీ పటేల్ ’) చెందినవారు అని కామ్రేజ్ పోలీస్ అధికారులు తెలిపారు. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.

పోస్ట్‌లోని వీడియో యొక్క స్క్రీన్‌షాట్స్‌ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, అదే వీడియోతో ఉన్న ‘ది టైమ్స్ అఫ్ ఇండియా’ న్యూస్ ఆర్టికల్ సెర్చ్ రిజల్ట్స్‌లో వస్తుంది. వీడియోలోని ఘటన గత వారం సూరత్ (గుజరాత్) నగరం దగ్గరలోని కామ్రేజ్ ప్రాంతంలో జరిగినట్టు తెలిసింది. అబ్బాయి పేరు ‘ఫెనిల్ గొయాని’ మరియు అమ్మాయి పేరు ‘గ్రీష్మా’ అని, వారు చిన్నప్పటి నుండి స్నేహితులని, అయితే హత్య చేయడానికి గల కారణాలు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపినట్టు ‘ది టైమ్స్ అఫ్ ఇండియా’ అర్టికల్‌లో చదవచ్చు.

అంతేకాదు, హత్య చేసాక చుట్టూ అందరూ వచ్చేయడంతో ఏం చేయాలో తేలిక తన చేయిని ఫెనిల్ గొయాని కోసుకున్నాడని, పోలీసులు తనని పట్టుకొని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లినట్టు తెలిసింది. ఈ ఘటనలో గ్రీష్మా బంధువులు కూడా గాయపడ్డారు.

అయితే, పోస్ట్‌లో చెప్పినట్టు హత్య చేసిన ఫెనిల్ గొయాని ముస్లిం మతస్థుడు కాదు. అబ్బాయి మరియు అమ్మాయి ఇద్దరూ ఒకే సామజిక వర్గానికి చెందినవారని ‘అహ్మదాబాద్ మిర్రర్’ అర్టికల్‌లో చదవచ్చు. అంతేకాదు, కామ్రేజ్ పోలీస్ అధికారులకి FACTLY ఫోన్ చేసి మాట్లాడగా, వారు కూడా అబ్బాయి ముస్లిం మతస్థుడు కాదని, అబ్బాయి మరియు అమ్మాయి ఇద్దరూ ఒకే సామజిక వర్గానికి (‘గుజరాతీ పటేల్’) చెందినవారని తెలిపారు.

ఈ హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ మరియు ఇక్కడ చదవచ్చు. హత్యపై నమోదు అయిన FIR కాపీని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, వీడియోలో అమ్మాయిని నరికి చంపుతున్న వ్యక్తి ముస్లిం మతస్థుడు కాదు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు.

Share.

About Author

Comments are closed.

scroll