‘కమ్యూ‘నిజం’ అంటే ఇదే’, అని చెప్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆఫీస్ టేబుల్ మీద భోజనం చేస్తుంటే పోలీస్ అధికారులు నిలబడి చూస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆఫీస్ టేబుల్ మీద భోజనం చేస్తుంటే పోలీస్ అధికారులు నిలబడి చూస్తున్న ఫోటో. ఇదే కమ్యూ‘నిజం’ అంటే.
ఫాక్ట్: పోస్ట్ చేసినది ఒక ఎడిట్ చేయబడిన ఫోటో. ఒరిజినల్ ఫోటో లో భోజనం ఆకు స్థానంలో ‘జనరల్ డైరీ’ ఉన్నట్టు చూడవొచ్చు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ 2018 లో ఒక పోలీస్ స్టేషన్ ని కొత్తగా ప్రారభించినప్పుడు ఆ ఫోటోని తీసారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఫోటోకి సంబంధించి 2018 లో ప్రచురించిన చాలా న్యూస్ ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చాయి. అది ఒక ఎడిట్ చేయబడిన ఫోటో అని ఆ ఆర్టికల్స్ లో చూడవొచ్చు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ 2018 లో ఒక పోలీస్ స్టేషన్ ని కొత్తగా ప్రారభించినప్పుడు ఆ ఫోటోని తీసినట్టు తెలిసింది. అసలు ఫోటో లో భోజనం ఆకు స్థానంలో ‘జనరల్ డైరీ’ ఉన్నట్టు చూడవొచ్చు.
అంతేకాదు, ఫేక్ ఫోటోని షేర్ చేసినందుకు జూలై 2018 లో కేరళ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చదవొచ్చు.
చివరగా, పినరయి విజయన్ ఆఫీస్ టేబుల్ మీద భోజనం చేస్తుంటే పోలీస్ అధికారులు నిలబడి చూస్తున్నది ఫేక్ ఫోటో.