DMK అధినేత స్టాలిన్ అల్లుడి ఇంటి ఫై జరిగిన IT దాడులలో 700 కోట్ల నగదు, 280 కేజీల బంగారం, 3000 కోట్లు విలువ చేసే డాక్యుమెంట్లు పట్టుబడినట్టు కొన్ని ఫోటోలతో కూడిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. 02 ఏప్రిల్ 2021 నాడు, DMK అధినేత స్టాలిన్ అల్లుడు శబరీశన్ ఇంటి పై IT అధికారులు రైడ్ నిర్వహించినట్టు పలు న్యూస్ ఆర్టికల్స్ రిపోర్ట్ చేసాయి. తమిళనాడులో 06 ఏప్రిల్ 2021 నాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: DMK అధినేత స్టాలిన్ అల్లుడి ఇంటి పై జరిగిన IT దాడులలో పట్టుబడిన భారీ నగదు, బంగారం, డాక్యుమెంట్ల యొక్క ఫోటోలు.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన మూడు ఫోటోలు, తమిళనాడులో జరిగిన పాత IT రైడ్లకి సంబంధించినవి. పోస్టులోని మరొక ఫోటో కూడా DMK అధినేత స్టాలిన్ అల్లుడు సబరీసన్ పై ఇటివల జరిగిన IT దాడులకి సంబంధించినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఫోటో-1:
పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ గతంలో చాలా న్యూస్ ఆర్టికల్స్ పబ్లిష్ అయినట్టు తెలిసింది. ఆ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. దేశంలోని వివిధ ప్రాంతాలలో IT సోదాలు నిర్వహించినప్పుడు, న్యూస్ సంస్థలు ఈ ఫోటోని రిఫరెన్స్ ఫోటోగా వాడుకున్నట్టు తెలిసింది. అంతేకాదు, ఈ ఫోటోని ఒక యూసర్ 12 నవంబర్ 2016 నాడు ట్వీట్ చేసారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో DMK అధినేత స్టాలిన్ అల్లుడు శబరిశన్ ఇంటి పై ఇటివల జరిగిన IT దాడులకి సంబంధించింది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఫోటో-2 మరియు 3:
పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోలని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే ఫోటోలని షేర్ చేస్తూ ‘ANI’ న్యూస్ సంస్థ 17 జూలై 2018 నాడు ఒక ట్వీట్ పెట్టినట్టు తెలిసింది. తమిళనాడు లోని SPK కంపెనీ పై జరిగిన IT సోదాలలో అధికారులు 163 కోట్ల నగదు, 100 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకునట్టు ఈ ట్వీట్ లో రిపోర్ట్ చేసారు. దీనిబట్టి, ఈ ఫోటోలు తమిళనాడు లో జరిగిన పాత IT రైడ్ కి సంబంధించిందని ఖచ్చితంగా చెప్పవచ్చు.
ఫోటో-4:
పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘ANI’ 01 ఏప్రిల్ 2019 నాడు ఒక ట్వీట్ పెట్టినట్టు తెలిసింది. 29 మార్చి 2019 రాత్రి వెల్లూరు నగరంలోని ఒక సిమెంట్ గోడౌన్ లో జరిగిన IT సోదాలలో, అధికారులు భారి నగదుని స్వాధీనం చేసుకునట్టు ఈ ట్వీట్ లో తెలిపారు.
అంతే కాదు, DMK అధినేత స్టాలిన్ అల్లుడి ఇంటి పై జరిగిన IT దాడులలో పోస్ట్ లో చెప్పిన నగదు గానీ, బంగారం గానీ, వేరే డాకుమెంట్స్ పట్టుబడ్డట్టు ఎటువంటి సమాచారం లేదు.
చివరగా, సంబంధం లేని పాత ఫోటోలని షేర్ చేస్తూ DMK స్టాలిన్ అల్లుడి ఇంటి పై జరిగిన IT దాడులలో అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం యొక్క ఫోటోలంటున్నారు.