ఫేస్బుక్ లో ఒక వీడియో ని పెట్టి, షాహీన్ బాగ్ నిరసనకారులకి వ్యతిరేకంగా బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఆయన్ని కొట్టి, బట్టలు విప్పించ్చారని చెప్తున్నారు. అందులో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: షాహీన్ బాగ్ (ఢిల్లీ) నిరసనకారులకి వ్యతిరేకంగా బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఆయన్ని కొట్టి, బట్టలు విప్పించ్చిన వీడియో.
ఫాక్ట్ (నిజం): వీడియోలో కొట్టబడిన వ్యక్తి పేరు ‘పవన్’. అంబాలా (హర్యానా) లో ముగ్గురు అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్నందుకు గానూ అక్కడి వారు అతన్ని కొట్టారు. కావున, వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఢిల్లీ (వెస్ట్) బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ కాదు. పోస్ట్ లో చెప్పింది తప్పు.
ఢిల్లీ (వెస్ట్) బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ షాహీన్ బాగ్ నిరసనల్లో పాల్గొనే వారు ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి ప్రవేశించి, వారి ఇంట్లో ఉన్న మహిళలను రేప్ చేసి చంపేస్తారని వివాదాస్పదంగా మాట్లాడినట్లుగా ‘ANI’ వారి ట్వీట్ లో ఉన్న వీడియో ద్వారా తెలుస్తుంది. పర్వేశ్ వర్మ వ్యాఖ్యలు ‘28 జనవరి 2020’ న చేశారు.
పోస్టులోని వీడియో యొక్క స్క్రీన్ షాట్లని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ‘Dainik Bhaskar’ వారి కథనం లభించింది. దాని ద్వారా, అంబాలా (హర్యానా) లో ముగ్గురు పాఠశాల అమ్మాయిలను ‘పవన్’ అనే వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నందుకు గానూ అతన్ని అక్కడి వారు కొట్టారని తెలిసింది. ఆ ఘటన ‘21 జనవరి 2020’ న జరిగింది.
ఇదే వీడియో ఇంతకముందు వేరే క్లెయిమ్ తో వైరల్ అయినప్పుడు FACTLY రాసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్ ని ఇక్కడ చూడవొచ్చు.
చివరగా, వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఢిల్లీ (వెస్ట్) బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ కాదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?