Fake News, Telugu
 

నిందితుల్లో ఒకరిని ఎన్కౌంటర్లో యూ.పీ. పోలీసులు కాళ్ళ పై కాల్చారు. అంతేకానీ, ముగ్గురిని ఎన్కౌంటర్లో చంపలేదు

1

ఉత్తరప్రదేశ్ లోని కౌశాంభి జిల్లాలో ఒక మైనర్ అమ్మాయిని ముగ్గురు గ్యాంగ్ రేప్ చేసి, వీడియో తీసినట్టు వార్తల్లో చూడొచ్చు. ఆ ముగ్గురిని యూ.పీ. పోలీసులు (‘యోగీ సర్కార్’) ఎన్కౌంటర్లో చంపేసినట్టు ఉన్న ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్ : కౌశాంభి జిల్లాలో ఒక మైనర్ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసిన ముగ్గురిని ఎన్కౌంటర్లో లేపేసిన యోగి సర్కార్. 

ఫాక్ట్ (నిజం): నిందితుల్లో ఒకరిని పట్టుకునే సమయంలో యూ.పీ. పోలీసులు తన కాళ్ళ పై కాల్చారు. అంతేకానీ, ముగ్గురునీ ఎన్కౌంటర్లో చంపలేదు. కావున పోస్ట్ లో ముగ్గురిని ‘లేపేసినట్టు’ చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో వెతకగా, నిందితుల్లో ఒకరిని ఘటనా స్థలంలోనే పట్టుకున్నారని, ఇంకిద్దరు (ఆదిల్ మరియు ఆకిబ్) పారిపోయారని ‘Aaj Tak’ ఆర్టికల్ లో చదవచ్చు. అయితే, సెప్టెంబర్ 24న ఆదిల్ (అలియాస్ ‘చోట్కా’) ని పట్టుకునే సమయంలో యూ.పీ. పోలీసులు ఎన్కౌంటర్లో తన కాళ్ళ పై కాల్చినట్టు తెలుస్తుంది. ఆదిల్ ని అరెస్ట్ చేసినట్టు ‘కౌసాంభి పోలీసు’ వారు తమ ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేసారు.

మూడో వాడిని (ఆకిబ్ అలియాస్ ‘బడ్కా’) ని కూడా అరెస్ట్ చేసినట్టు కౌశాంభి పోలీసులు ఇంకో ట్వీట్ ద్వారా తెలిపారు. ఇదే విషయాన్ని ‘Times of India’ ఆర్టికల్ లో కూడా చదవచ్చు.

చివరగా, నిందితుల్లో ఒకరిని ఎన్కౌంటర్లో యూ.పీ. పోలీసులు కాళ్ళ పై కాల్చారు. అంతేకానీ, ముగ్గురిని ఎన్కౌంటర్లో చంపలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll