Fake News, Telugu
 

శూద్రుల పట్ల వివక్ష చూపేలా అనుశాసనిక పర్వంలో ధర్మరాజుతో కృష్ణుడు ఇలా అనలేదు

0

హిందూ మత గ్రంధాలు శూద్రుల పట్ల వివక్షను ప్రోత్సహిస్తుందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. దీనికి రుజువుగా ‘శూద్రుడి ఇంట్లో భోజనం చేస్తే సమస్త పృథ్వీ మలాన్ని తిన్నట్టేనని’ మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో కృష్ణుడు ధర్మరాజుతో అన్నాడని ఈ పోస్ట్ ద్వారా వాదిస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: శూద్రుడి ఇంట్లో భోజనం చేస్తే సమస్త పృథ్వీ మలాన్ని తిన్నట్టేనని – మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో కృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు.

ఫాక్ట్(నిజం): అసలు అనుశాసనిక పర్వం అనేది ధర్మరాజు, భీష్ముడికి మధ్య జరిగే సంభాషణకు సంబంధించింది, కృష్ణుడికి, ధర్మరాజుకు మధ్య జరిగే సంభాషణ కాదు. కాగా ఈ పర్వంలో గాని లేక మొత్తం భారతంలో శూద్రుడి ఇంట్లో భోజనం చేసే అంశానికి సంబంధించి కృష్ణుడు ఇలా అనలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

శూద్రుడి ఇంట్లో భోజనం చేసే విషయానికి సంబంధించి  మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో కృష్ణుడు ధర్మరాజుతో ఈ వ్యాఖ్యలు చేసినట్టు చెప్తున్నారు. కాని అసలు అనుశాసనిక పర్వం అనేది ధర్మరాజుకి, భీష్ముడికి మధ్య జరిగే సంభాషణకు సంబంధించింది, పోస్టులో వాదిస్తున్నట్టు కృష్ణుడికి మరియు ధర్మరాజుకు మధ్య జరిగే సంభాషణ కాదు. దీన్నిబట్టి పోస్టులో చేస్తున్న వాదన కల్పితం అని తెలుస్తుంది.

రాజకీయ పరిపాలన, రాజ్యాధికారం మొదలైన అంశాలపై యుధిష్ఠిరుడు, భీష్ముడి చేసిన ప్రభోదాలు ఈ పర్వంలో పొందపరిచారు. సామాజిక ప్రవర్తన, నైతికత మరియు ఆచారాలకు సంబంధించి వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఈ పర్వంలో ఉంటుంది.

ఆహారం తీసుకోవడానికి సంబంధించిన మర్యాదలు మొదలైన అంశాలకు సంబంధించి ఈ పర్వంలో ప్రస్తావనలు ఉన్నప్పటికి, పోస్టులో వాదిస్తున్నట్టు ‘శూద్రుడి ఇంట్లో భోజనం చేస్తే సమస్త పృథ్వీ మలాన్ని తిన్నట్టేనని’ లేక ‘శూద్రుని ఇంట అన్నం తిన్న బ్రాహ్మాణుడు మనుషుల మలాన్ని తిన్నట్టే’ అన్న వ్యాఖ్యలు ఈ పర్వంలో అనలేదు. వైరల్ పోస్టులో ప్రస్తావించిన శ్లోకాలు కూడా ఈ అంశానికి సంబంధించినవి కావు.

బ్రాహ్మణులు ఇతర వర్ణాల వారితో కలిసి భోజనం చేసినప్పుడు పాటించాల్సిన పరిహారాల గురించి ఈ అనుశాసనిక పర్వంలో చెప్పినట్టు పలు బ్లాగ్స్ పేర్కొన్నప్పటికీ, వైరల్ అవుతున్న వ్యాఖ్యలు కృష్ణుడు చేసినట్టు మాత్రం వీటిలో లేదు.

ఇదిలా ఉండగా కృష్ణుడు, ధర్మరాజు మధ్య సంభాషణ గురుంచి అశ్వమేధ పర్వంలో ప్రస్తావన ఉంటుంది. కాని ఈ పర్వంలో శూద్రుల ఇంట్లో భోజనానికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు. ఇదే కాకుండా మొత్తం మహాభారతంలో కృష్ణుడు ఇలా అన్నట్టు లేదు.

చివరగా, శూద్రుల పట్ల వివక్ష చూపేలా అనుశాసనిక పర్వంలో ధర్మరాజుతో  కృష్ణుడు ఇలా అనలేదు.

Share.

About Author

Comments are closed.

scroll