Fake News, Telugu
 

వీడియోలోని ఘటనకు, లవ్ జీహాద్ కి సంబంధంలేదు; భార్య మీద అనుమానంతో భర్త హత్య చేసాడు. ఇద్దరూ హిందువులే

0

ఢిల్లీ లో పరిస్థితి కాశ్మీర్ లాగా మారిపోయింది; లవ్ జీహాద్ విరోధం చేసే ఈ మహిళను నడి రోడ్డు మీద అందరి ముందు హత్య చేశాడు’, అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: లవ్ జీహాద్ ని విరోధించినందుకు ఢిల్లీ లో మహిళను ఒక వ్యక్తి హత్య చేస్తున్న వీడియో.

ఫాక్ట్: వీడియోలో ఉన్నవారు భార్యాభర్తలు. భార్య (నీలు మెహత) కి మరో వ్యక్తి తో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భర్త (హరీష్ మెహత) తనని హత్య చేసాడు. హరీష్ మరియు నీలు ఇద్దరు ఒకే వర్గానికి చెందినవారని, ఈ ఘటన లో లవ్ జీహాద్ లాంటిది ఏమీ లేదని పోలీసులు తెలిపారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని వీడియో గురించి ఇంటర్నెట్ లో వెతకగా, వీడియోలోని ఘటన కి సంబంధించిన చాలా న్యూస్ ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చాయి. ఆ ఘటన ఢిల్లీ లోని రోహిణి ప్రాంతంలో జరిగింది. వీడియోలో ఉన్నవారు భార్యాభర్తలని, భార్య (నీలు మెహత) కి మరో వ్యక్తి తో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భర్త (హరీష్ మెహత) తనని హత్యచేసాడని పోలీసులు తెలిపినట్టు తెలిసింది. ఈ ఘటన పై వివిధ వార్తాసంస్థలు ప్రచురించిన న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చదవొచ్చు.

అంతేకాదు, ఒక ట్వీట్ కి ‘DCP Rohini’ రిప్లై ఇస్తూ, ‘హరీష్ మరియు నీలు ఇద్దరు ఒకే వర్గానికి చెందినవారు. లవ్ జీహాద్ లాంటిది ఏమీ లేదు’, అని ట్వీట్ చేసారు.

ఈ ఘటన పై ఫైల్ చేయబడిన FIR కాపీ ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, వీడియోలోని ఘటనకు, లవ్ జీహాద్ కి సంబంధంలేదు; భార్య మీద అనుమానంతో భర్త హత్య చేసాడు. ఇద్దరూ హిందువులే.

Share.

About Author

Comments are closed.

scroll