Fake News, Telugu
 

‘పాకిస్థాన్‌కు కోట్లలో కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులు పంపి, మహారాష్ట్రకు కేవలం 7.5 లక్షల డోసులు పంపిన మోదీ ప్రభుత్వం’ అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు

0

పాకిస్థాన్‌కు 4.5 కోట్ల డోసులు వ్యాక్సిన్ పంపిన మోడీ, ఇండియాలోని పాజిటివ్ కేసుల్లో 60% కేసులు ఉన్న మహారాష్ట్రకు 7.5 లక్షల డోసులు వ్యాక్సిన్ మాత్రమే పంపారు’, అని చెప్తూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పాకిస్థాన్‌కు 4.5 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులు పంపి, భారత్ లోని మహారాష్ట్రకు మాత్రం కేవలం 7.5 లక్షల డోసులు పంపిన మోదీ ప్రభుత్వం.

ఫాక్ట్: అన్నీ రాష్ట్రాల్లో కంటే అత్యధికంగా కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులు వేసింది మహారాష్ట్రలోనే. ఇప్పటికి సుమారు ఒక కోటి ఐదు లక్షల డోసులుకు పైగా మహారాష్ట్రలో వేసారు. పోస్ట్ లో చెప్పిన ‘7.5 లక్షల డోసులు’ తాజాగా మహారాష్ట్రకి కేటాయించిన డోసులు; మొత్తం పంపిన వ్యాక్సిన్ డోసులు కాదు. అయితే, ఆ 7.5 లక్షల లిమిట్ ని కూడా 17 లక్షలకు కేంద్ర ప్రభుత్వం పెంచినట్టు వార్తాసంస్థలు రిపోర్ట్ చేసాయి. పాకిస్థాన్ కి 45 మిలియన్ కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులను ‘GAVI alliance’ ద్వారా భారత్ పంపించనున్నట్టు తెలిసింది. అయితే, ఇప్పటి వరకు భారత్ వ్యాక్సిన్ పంపిన వివిధ దేశాల లిస్టులో పాకిస్థాన్ పేరు లేనట్టు భారత్ యొక్క విదేశీ వ్యవహారాల శాఖ వెబ్సైటులో చూడవొచ్చు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

మహారాష్ట్ర మరియు పాకిస్థాన్ ని విడివిడి గా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్ని డోసులు వారికి పంపించిందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.

మహారాష్ట్ర:

మహారాష్ట్ర లో ఇచ్చిన కోవిడ్-19 వ్యాక్సిన్ డోసుల డేటా గురించి వెతకగా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారు 13 ఏప్రిల్ 2021 న ఇచ్చిన ప్రెస్ రిలీజ్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ ప్రెస్ రిలీజ్ ప్రకారం అన్నీ రాష్ట్రాల్లో కంటే అత్యధికంగా కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులు వేసింది మహారాష్ట్రలోనే. సుమారు ఒక కోటి ఐదు లక్షల డోసులకి పైగా వేసినట్టు చూడవొచ్చు. 12 ఏప్రిల్ 2021 న ‘ది టైమ్స్ అఫ్ ఇండియా’ వారు ప్రచురించిన ఆర్టికల్ లో కూడా మహారాష్ట్ర లో కోటి డోసులకి పైగా వేసినట్టు చదవొచ్చు.

అంతేకాదు, కోవిడ్-19 వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన ‘కోవిన్’ డాష్ బోర్డు లోని ‘వ్యాక్సినేషన్ కవరేజ్’ గ్రాఫ్ లో కూడా మహారాష్ట్ర ముందంజ లో ఉన్నట్టు చూడవొచ్చు.

మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ తాజగా రిలీజ్ చేసిన వ్యాక్సిన్ ఆర్డర్ లో మహారాష్ట్ర కి కేవలం 7.5 లక్షల డోసులు కేటాయించినట్టు తెలిపారని ‘హిందుస్తాన్ టైమ్స్’ రిపోర్ట్ చేసింది. కాబట్టి, పోస్ట్ లో చెప్పిన ‘7.5 లక్షల డోసులు’ తాజగా మహారాష్ట్ర కి కేటాయించిన డోసులు; మొత్తం పంపిన వ్యాక్సిన్ డోసులు కాదు. అయితే, ఆ 7.5 లక్షల లిమిట్ ని కూడా 17 లక్షలకు కేంద్ర ప్రభుత్వం పెంచినట్టు ‘హిందుస్తాన్ టైమ్స్’ వారి ఆర్టికల్ లో చదవొచ్చు.

పాకిస్థాన్:

పాకిస్థాన్ కి 45 మిలియన్ కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులను ‘GAVI alliance’ ద్వారా భారత్ పంపించనున్నట్టు కొన్ని వార్తాసంస్థలు మార్చి లో రిపోర్ట్ చేసినట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. 45 మిలియన్ లో 16 మిలియన్ డోసులు పాకిస్తాన్ కి జూన్ వరకు వస్తాయి అని పాక్ అధికారులు తెలిపినట్టు తెలిసింది.

అయితే, ఇప్పటి (13 ఏప్రిల్ 2021) వరకు భారత్ ‘మేడ్ ఇన్ ఇండియా’ కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిన వివిధ దేశాల లిస్టులో పాకిస్థాన్ పేరు లేనట్టు భారత్ యొక్క విదేశీ వ్యవహారాల శాఖ వెబ్సైటులో (ఆర్కైవ్డ్) చూడవొచ్చు. మే 2021 వరకు పాకిస్తాన్ కి సుమారు 14.6 మిలియన్ డోసులు పంపించనున్నట్టు ‘GAVI – COVAX’ వారి కేటాయింపుల లిస్టులో చూడవొచ్చు. భారత్ లో పెరుగుతున్న కేసులు మరియు డిమాండ్ వల్ల సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా వారి నుండి వచ్చే మార్చి మరియు ఏప్రిల్ నెలల డెలివరీలు ఆలస్యం అవుతుందని ‘COVAX’ వారు తెలిపినట్టు ఇక్కడ చదవొచ్చు.

8 ఏప్రిల్ 2021 వరకు ‘COVAX’ వారు కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులు పంపించిన వివిధ దేశాల లిస్టులో పాకిస్థాన్ పేరు లేనట్టు గమనించవొచ్చు.

తమ దేశానికి మే వరకు సుమారు 15 మిలియన్ వ్యాక్సిన్ డోసులు ‘COVAX’ ద్వారా వస్తాయని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి తెలిపినట్టు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, ‘పాకిస్థాన్‌కు కోట్లలో కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులు పంపి, మహారాష్ట్రకు కేవలం 7.5 లక్షల డోసులు పంపిన మోదీ ప్రభుత్వం’ అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికి సుమారు ఒక కోటి ఐదు లక్షల డోసులుకు పైగా వేసారు మహారాష్ట్రలో.

Share.

About Author

Comments are closed.

scroll