Fake News, Telugu
 

స్కూటీ కొనుక్కోవడానికి అమ్మాయిలకు 75,000 రూపాయిలు మోడీ ప్రభుత్వం ఇస్తుందని వస్తున్న వార్తల్లో నిజం లేదు

0

రెండవసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన మోడీ దేశంలోని అమ్మాయిల కోసం కొత్తగా ‘స్కూటీ యోజన’ ని మొదలుపెట్టారని చెప్తూ ఒక లింక్ తో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ‘స్కూటీ యోజన’ ని ప్రారంభించిన మోడీ. పదవ తరగతి పాసైన ప్రతి అమ్మాయికి స్కూటీ కొనుక్కోవడానికి 75,000 రూపాయిలు.

ఫాక్ట్ (నిజం): అసలు ‘స్కూటీ యోజన’ అనే పేరుతో ఎటువంటి కేంద్ర ప్రభుత్వం పథకం లేదు. తమిళనాడు లో ‘అమ్మ స్కూటర్ స్కీం’ ఉంది, కానీ దాని అర్హత షరతులు వేరేలా ఉన్నాయి మరియు అది ఆ రాష్టంలోని ఆడవాళ్లకే వర్తిస్తుంది. జమ్మూ కాశ్మీర్ లో కూడా ఒక పథకం ఉంది, కానీ అది కూడా కేంద్ర పథకం కాదు. పోస్ట్ లో చెప్పినట్టు దేశంలోని అన్ని రాష్ట్రాల అమ్మయిల కోసం మోడీ ప్రభుత్వం ఎటువంటి ‘స్కూటీ యోజన’ ని మొదలుపెట్టలేదు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

పోస్ట్ లోని విషయాల కోసం గూగుల్ లో వెతకగా, ‘స్కూటీ యోజన’ పై ఎటువంటి సమాచారం దొరకదు. ఒకవేళ మోడీ దేశంలోని అన్ని రాష్ట్రాల అమ్మాయిల కోసం అటువంటి పథకం మొదలుపెడితే అన్ని వార్తా పత్రికలు దాని గురించి ప్రచురించేవి, కానీ అలాంటి పథకం గురించి ఎక్కడా కూడా దొరకలేదు. అంతే కాదు, ఏ ప్రభుత్వ వెబ్సైటు లో కూడా ఇటువంటి స్కీం గురుంచి సమాచారం లేదు. భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా దీని గురుంచి ఎక్కడ పేర్కొనలేదు.

కానీ గత సంవత్సరం మోడీ తమిళనాడు లో ‘అమ్మ స్కూటర్ స్కీం’ ని ప్రారంభించినట్టుగా వార్తాపత్రికలు ప్రచురించిన ఆర్టికల్స్ దొరుకుతాయి. ‘అమ్మ స్కూటర్ స్కీం’ కేవలం తమిళనాడు లో వర్తిస్తుంది , అది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టిన పథకం. దాంట్లో కూడా పని చేసే ఆడవాళ్లకు స్కూటీ కొనుక్కోవడానికి యాబై శాతం సబ్సిడీ లేదా ఇరవై ఐదు వేల రూపాయల సహాయం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా కాలేజీకి వెళ్ళే అమ్మాయిల కోసం స్కూటీ పథకం మొదలు పెట్టింది, కానీ అది కూడా కేంద్ర పథకం కాదు. కావున పోస్ట్ లో చెప్పినట్టు స్కూటీ కోసం 75,000 రూపాయలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం పథకం ఎక్కడా కూడా లేదు.

రాజస్తాన్ ప్రభుత్వం కూడా మహిళలకు స్కూటీ ఇవ్వడానికి రెండు పథకాలని ప్రారంభించింది: : ‘Medhavi Chathra Scooty Yojana’ and ‘Devnarayan Chathra Scooty Yojana’. ఈ రెండు పథకాలు రాజస్తాన్ రాష్ట్రంలోని వాళ్ళకే వర్తిస్తుంది. ఈ పథకాలు కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం కి సంబంధించినవి, కావున పోస్ట్ లో చెప్పినట్టుగా దేశం అంతా వర్తించదు. ఫేస్బుక్ పోస్టులే కాదు, ఈనాడు వార్తాపత్రిక కూడా ప్రధాన మంత్రి ‘స్కూటీ యోజన’ ప్రారంభించినట్టుగా తప్పుగా ప్రచురించింది. ఆ వార్తలో ఇచ్చిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే అది రాజస్తాన్ రాష్ట్రానికి సంబంధించిన పథకం అని తెలుస్తుంది.

చివరగా, స్కూటీ కొనుక్కోవడానికి 75,000 రూపాయిలు మోడీ ప్రభుత్వం ఇస్తుందని వస్తున్న వార్తల్లో నిజం లేదు. 

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?


Share.

About Author

Comments are closed.

scroll