Fake News, Telugu
 

ఈ ISDO రిక్రూట్మెంట్‌కీ, ప్రభుత్వానికీ ఎటువంటి సంబంధంలేదు, సంస్థ వెబ్సైటులో ఈ రిక్రూట్మెంట్‌కి సంబంధించి పూర్తి వివరాలు కూడా లేవు

0

లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలోని ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్ ఆర్గానైజేషన్ 3842 పోస్టుల నియామకం చేపడుతుందని, అప్లికేషను లింక్ షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఈ నియామకానికి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలోని ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్ ఆర్గానైజేషన్ 3842 పోస్టుల నియామకం చేపడుతుంది.

ఫాక్ట్ (నిజం): ఈ రిక్రూట్మెంట్‌కి ప్రభుత్వానికీ ఎటువంటి సంబంధంలేదు. కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ మంత్రిత్వ శాఖ వెబ్సైటులోగాని లేక దీని అనుబంధ సంస్థల వెబ్సైటుల్లో ఈ రిక్రూట్మెంట్ గురించి ఎటువంటి సమాచారం లేదు. ఈ ISDO వెబ్సైటు డొమైన్ మార్చ్ 2021లో అమెరికాలో రిజిస్టర్ అయ్యింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ రిక్రూట్మెంట్‌కీ, ప్రభుత్వానికీ ఎటువంటి సంబంధంలేదు. కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ మంత్రిత్వ శాఖ వెబ్సైటులో గానీ లేక దీని అనుబంధ సంస్థల వెబ్సైటుల్లో గానీ ఈ రిక్రూట్మెంట్ గురించి ఎటువంటి సమాచారం లేదు. ఇది ప్రభుత్వ నియామకం అయ్యుంటే, దీని గురించి సమాచారం అందుబాటులో ఉండాలి. కానీ, ఇంటర్నెట్‌లో దీని గురించి ఎటువంటి సమాచారం మాకు లభించలేదు.

కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ మంత్రిత్వ శాఖ స్కిల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSDC) ద్వారా వివిధ సంస్థలు, ఇతర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, NGOలతో కలిసి యువతకు పరిశ్రమ సంబంధిత నైపుణ్య శిక్షణ అందిస్తుంది. ఐతే ISDO వెబ్సైటులో ఈ సంస్థ ప్రభుత్వంతో కలిసి పని చేస్తునట్టు ఎటువంటి సమాచారం లేదు. సంస్థ ఫోన్ నెంబర్ గాని, పూర్తి అడ్రస్ వివరాలు కూడా లేవు. పైగా ఈ రిక్రూట్మెంట్‌కి సంబంధించిన డిటైల్డ్ నోటిఫికేషన్ కూడా అందుబాటులో లేదు.

కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ మంత్రిత్వ శాఖ అనుబంధ సంస్థ అయిన నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSDC) వెబ్సైటులో స్కిల్ డెవలప్మెంట్ పేరుతో జరుగుతున్న ఫేక్ నియామకాలు జరుగుతున్నాయని, ఈ నియామకాలకి NSDCకి ఎటువంటి సంబంధంలేదని తెలుపుతూ, కొన్ని ఫేక్ నియామకాల ఉదాహారణలు కూడా ఇచ్చారు.

పైగా ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్ ఆర్గానైజేషన్ వెబ్సైటు (https://isdoindia.org/) డొమైన్ మార్చ్ 2021లో అమెరికాలో రిజిస్టర్ అయ్యింది. వీటన్నిటి బట్టి ఈ రిక్రూట్మెంట్‌కి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధంలేదని అర్ధమవుతుంది.

చివరగా, ఈ ISDO రిక్రూట్మెంట్‌కీ, ప్రభుత్వానికీ ఎటువంటి సంబంధంలేదు, సంస్థ వెబ్సైటులో ఈ రిక్రూట్మెంట్‌కి సంబంధించి పూర్తి వివరాలు కూడా లేవు.

Share.

About Author

Comments are closed.

scroll