Fake News, Telugu
 

హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతున్న తండ్రిని కొడుకు చేయి పట్టుకొని తీసుకెళ్తున్న ఫోటోని తప్పుగా ప్రచారం చేస్తున్నారు

0

కళ్ళు లేని కొడుకు కోసం ఒక తండ్రి తన కన్ను దానం చేసినట్టుగా సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. మ్యాచింగ్ కంటి ప్యాచులు ధరించిన తండ్రీ కొడుకుల ఫోటోని ఈ పోస్టులో షేర్ చేసారు. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.    

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్లని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కళ్ళు లేని కొడుకు కోసం తండ్రి తన కన్ను దానం చేసినట్టుగా సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటోలో కనిపిస్తున్న జిమ్మీ హిలసబెక్ అనే వ్యక్తి, మెదడులో రక్తస్రావం కారణంగా  హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. గామా నైఫ్ రేడియో సర్జరీ చేయించుకున్న హిలసబెక్ ని, చికిత్స పూర్తయిన ఆరు నెలల వరకు కంటి ప్యాచ్ ధరించాలని డాక్టర్లు సూచించారు. హిలసబెక్ కొడుకు బ్రున్సన్, తన తండ్రి ధరించిన లాంటి కంటి ప్యాచ్ ని ధరించి ఇలా తన తండ్రిని నడిపిస్తున్నాడు. ఫోటోలో కనిపిస్తున్న బాలుడికి కంటి చూపు పోలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘Huffpost’ న్యూస్ సంస్థ ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఒక కొడుకు తన తండ్రిని నడిపిస్తున్న దృశ్యం ఇదని ఆర్టికల్ లో తెలిపారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న జిమ్మీ హిలసబెక్ అనే వ్యక్తి మెదడులో రక్తస్రావం కారణంగా హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్టు ఈ ఆర్టికల్ లో తెలిపారు. పుట్టుకతోనే అర్టిరియో వీనస్ మాల్ఫార్మేషన్ (AVM) అనే జబ్బుతో బాధపడుతున్న హిలసబెక్, మెదడులో రక్తస్రావం తగ్గిపోవడానికి గామా నైఫ్ రేడియో సర్జరీ చేయించుకున్నట్టు ఇందులో తెలిపారు.

చికిత్స పూర్తయిన ఆరు నెలల వరకు హిలసబెక్ ని కంటి ప్యాచ్ ని ధరించమని డాక్టర్లు సూచించారు. హిలసబెక్ డిశ్చార్జ్ అయ్యే సమయంలో అతని కొడుకు బ్రున్సన్ కంటి ప్యాచ్ ని ధరించి ఒక పైరేట్ లా ఉహించుకుంటూ తన తండ్రిని నడిపిస్తూ తీసుకెళ్ళినట్టు పలు న్యూస్ ఆర్టికల్స్ రిపోర్ట్ చేసాయి. ఆ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. బ్రున్సన్ కేవలం తన సరదా కోసం కంటి ప్యాచ్ ధరించాడు, కంటి చూపు లేక కాదు. ఈ వివరాల ఆధారంగా ఫోటోలో కనపడుతున్న బాలుడి కంటి చూపు పోలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

సోషల్ మీడియాలో ఇటువంటి నేపథ్యంతో మరొక పోస్టు కూడా షేర్ అవుతుంది. కిడ్ని ఫెయిల్ అయిన తండ్రి కోసం ఒక కూతురు తన కిడ్నీని దానం చేసిందని ఒక ఫోటో (ఆర్కైవ్డ్) సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ ఫోటోకి సంబంధించిన వివరాల కోసం వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘Patrika’ న్యూస్ సంస్థ 2018లో ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది.  ఫోటోలో కనిపిస్తున్న పూజ బిజర్నియా అనే అమ్మాయి, Liver Cirrhosis అనే వ్యాధితో బాధపడుతున్న తండ్రి కోసం తన కాలేయం లోని కొంత భాగాన్ని దానం చేసినట్టు ఈ ఆర్టికల్ లో రిపోర్ట్ తెలిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ మొట్టమొదటగా రచిత్ భూషణ్ శ్రీవాత్సవ అనే డాక్టర్ 05 నవంబర్ 2017 నాడు తన ఫేస్బుక్ పేజిలో షేర్ చేసారు. ఈ సంఘటనకి సంబంధించి పబ్లిష్ అయిన మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

చివరగా, హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతున్న తండ్రిని  కొడుకు చేయి పట్టుకొని తీసుకెళ్తున్న ఫోటోని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll