Fake News, Telugu
 

నరసింహా రావు, రాజీవ్, రాహుల్ గాంధీలు ఇస్లామిక్ పద్ధతిలో ప్రార్ధిస్తున్న ఈ ఫోటో అబ్దుల్ గఫర్ ఖాన్ అంత్యక్రియల్లో తీసినది

0

ఇందిరా గాంధీ మృతదేహం ముందు నరసింహా రావు, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ ఎలా ప్రార్ధిస్తున్నారో చూడండి అని చెప్తూ, ఒక ఫోటోని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఫోటోలో వారు ఇస్లామిక్ పద్ధతిలో చేతులు పెట్టి ప్రార్ధిస్తున్నట్టు కనిపిస్తారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇందిరా గాంధీ మృతదేహం ముందు ఇస్లామిక్ పద్ధతిలో ప్రార్ధిస్తున్న నరసింహా రావు, రాజీవ్ మరియు రాహుల్ గాంధీల యొక్క ఫోటో.

ఫాక్ట్: మృతదేహం ముందు నరసింహా రావు, రాజీవ్ మరియు రాహుల్ గాంధీ ఇస్లాం పద్ధతిలో ప్రార్ధిస్తున్న ఈ ఫొటోలో ఇందిరా గాంధీ అంత్యక్రియల్లో తీసినది కాదు. ఆ ఫోటో అబ్దుల్ గఫర్ ఖాన్ అంత్యక్రియల్లో తీసినది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని ఫోటో గురించి ఇంటర్నెట్ లో వెతకగా, అదే ఫోటోని పాకిస్థాన్ రాజకీయ నాయకుడు ఒకరు పోస్ట్ చేసినట్టు తెలిసింది. అయితే, ఆ ఫోటో ‘బచా ఖాన్’ (అబ్దుల్ గఫర్ ఖాన్ యొక్క మరొక పేరు) యొక్క అంత్యక్రియల్లో తీసినట్టు రాసారు.

అబ్దుల్ గఫర్ ఖాన్ అంత్యక్రియలకు సంబంధించిన వీడియోలో కూడా ఫోటోలోని దృశ్యాన్ని చూడవొచ్చు.

అబ్దుల్ గఫర్ ఖాన్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి రాజీవ్ గాంధీ పెషావర్ వెళ్లినట్టు 1988 లో ‘AP News’ వారు ప్రచురించిన ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు. కాబట్టి, ఫోటోలో ఉన్నది ఇందిరా గాంధీ మృతదేహం కాదు.

ఇందిరా గాంధీ అంత్యక్రియలకు సంబంధించిన ఫోటోలను మరియు వీడియోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. ఈ దృశ్యాలకు, పోస్ట్ లోని ఫోటోకి చాలా తేడాలు ఉన్నట్టు గమనించవొచ్చు.

చివరగా, నరసింహా రావు, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీలు ఇస్లాం పద్ధతిలో ప్రార్ధిస్తున్న పోస్ట్ లోని ఫోటో అబ్దుల్ గఫర్ ఖాన్ అంత్యక్రియల్లో తీసినది, ఇందిరా గాంధీ అంత్యక్రియల్లో కాదు.

Share.

About Author

Comments are closed.

scroll