Fake News, Telugu
 

ఫోటోల్లో ఉన్న నాణేలు ఇండోనేషియాలో దొరకలేదు; భారత్ లో వివిధ సందర్భాల్లో దొరికాయి

0

ఇండోనేషియా లో ఒక పొలంలో గణేష్ విగ్రహం మరియు గణేష్ ప్రతిమ బంగారు నాణేలు బయటపడ్డాయి అని చెప్తూ, కొన్ని ఫోటోలను చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్:  ఫోటోల్లో ఉన్నవి ఇండోనేషియా లో ఒక పొలంలో బయటపడ్డ గణేష్ విగ్రహం మరియు గణేష్ ప్రతిమ బంగారు నాణేలు.

ఫాక్ట్ (నిజం):  పోస్ట్ లోని ఫోటోల్లో ఉన్న గణేష్ విగ్రహం నిజంగానే ఇండోనేషియా లో ఒక పొలంలో గత సంవత్సరం బయటపడింది. కానీ, బంగారు నాణేలు దొరికినట్టు ఎక్కడా కచ్చితమైన సమాచారం లేదు. పోస్ట్ లో పెట్టిన ఫోటోల్లో  ఉన్న నాణేలు భారత్ లో వివిధ సందర్భాల్లో దొరికాయి. కావున పోస్ట్ లో చెప్పింది కేవలం కొంతవరకు నిజం.

పోస్ట్ లోని గణేష్ విగ్రహం ఫోటోలను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఆ గణేష్ విగ్రహం నిజంగానే ఇండోనేషియా లో ఒక పొలంలో గత సంవత్సరం బయటపడిందని తెలుస్తుంది. దానికి సంబంధించి డిసెంబర్ 2019 మరియు జనవరి 2020 లో ప్రచురించిన న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. పోస్ట్ లోని ఫోటోలు ఆర్టికల్స్ లో చూడవొచ్చు.

అయితే, పై ఆర్టికల్స్ లో మరియు ఎక్కడా విగ్రహం తో పాటు బంగారు నాణేలు దొరికినట్టు రాసి లేదు. మరి పోస్ట్ లోని నాణేల ఫోటోలు ఎక్కడివో చూద్దాం:

ఫోటో 1:

ఈ ఫోటో తమిళనాడు లోని జంబుకేశ్వర ఆలయం లో తవ్వకాల్లో లభించిన నాణేల ఫోటో. దానికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

ఫోటో 2:

ఈ ఫోటో లో ఉన్నది బంగారు నాణేలు కాదు. అంతేకాదు, ఆ నాణెం డాక్టర్ ప్రకాష్ కొఠారి కి ముంబై లోని ‘చోర్ బజార్’ లో దొరికింది.  

ఫోటో 3:

ఈ ఫోటోలోని వస్తువులు మరియు నాణేలు 2017 లో శ్రీశైలంలో దొరికాయి. కావున ఇవి కూడా ఇండోనేషియా లో దొరకలేదు.

చివరగా, ఫోటోల్లో ఉన్న గణేష్ విగ్రహం నిజంగానే ఇండోనేషియా లో త్రవకాల్లో బయటపడింది. కానీ, ఫోటోల్లో  ఉన్న నాణేలు భారత్ లో వివిధ సందర్భాల్లో దొరికాయి.

Share.

About Author

Comments are closed.

scroll