Fake News, Telugu
 

మహారాష్ట్రలోని చిప్లున్ లో జరిగిన చిరుత దాడికి సంబంధించిన ఫోటోలని శ్రీశైలంలో జరిగినట్టుగా తప్పుగా షేర్ చేస్తున్నారు

0

శ్రీశైలం ఘాట్ రోడ్ లో చిరుతపులి దాడిలో ఇద్దరు వ్యక్తుల మరణం అని చెప్తూ, దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: శ్రీశైలం ఘాట్ రోడ్ లో చిరుతపులి దాడిలో ఇద్దరు వ్యక్తుల మరణం.

ఫాక్ట్(నిజం): పోస్టులోని ఫోటోలని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఫోటోలు మహారాష్ట్ర లోని చిప్లున్ పట్టణంలో 2018లో జరిగిన చిరుత దాడికి సంబంధించినవని తెలిసింది. ఈ ఫొటోలకి శ్రీశైలానికి ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో ఉన్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఫోటోలను ప్రచురించిన ఒక ఆన్‌లైన్ వార్తా కథనం మాకు కనిపించింది, ఈ కథనం 11 డిసెంబర్ 2018న ప్రచురించబడింది. ఐతే ఈ వార్తా కథనం ప్రకారం ఈ ఫోటోలు మహారాష్ట్ర లోని చిప్లున్ పట్టణంలో జరిగిన చిరుత దాడికి సంబంధించినవి. ఈ ఘటనకి సంబంధించిన వీడియో ఇక్కడ చూడొచ్చు. దీన్నిబట్టి ఈ ఫోటోలు పాతవని, కొన్ని సంవత్సరాల నుండి ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయని చెప్పొచ్చు.

ఇవే ఫోటోలని ఇంతకుముందు తప్పుడు క్లెయిమ్స్ తో షేర్ చేసినప్పుడు కొన్ని ఫాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్లు రాసిన కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, పోస్టులో ఉన్న ఫొటోస్ మహారాష్ట్రలోని చిప్లున్ లో జరిగిన చిరుత దాడికి సంబంధించినవి.

Share.

About Author

Comments are closed.

scroll