Fake News, Telugu
 

ఈ వీడియోలో మధ్యలోని నాలుగు గుండీలు ఎక్కడికీ పోలేదు; లెక్కించే ప్రక్రియ బట్టి మార్పులు చేసారు

0

ఈ వీడియో ఒకసారి చూడండి భలే గమ్మత్తయిన లెక్క ఇది చివరికి ఆ నాలుగు గుండీలు ఏమైతదో అర్థం కాదు”, అని చెప్తూ ఒక పోస్ట్‌ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: భలే గమ్మత్తయిన లెక్కను చూడండి. వీడియోలో చివరికి ఆ నాలుగు గుండీలు ఏమయ్యాయో అర్థం కాదు.

ఫాక్ట్: వీడియో మొదట్లో రెండు సార్లు లెక్కించే మూలల్లోని బాక్సుల్లో రెండేసి గుండీలు ఉన్నట్టు చూడవచ్చు. చివరికి వచ్చేసరికి ఒకేసారి లెక్కించే బాక్సుల్లో రెండేసి గుండీలు, రెండు సార్లు లెక్కించే మూలలలోని బాక్సుల్లో ఒకే గుండీ ఉన్నట్టు చూడవచ్చు. లెక్కించే ప్రక్రియ బట్టి వీడియోలో మార్పులు చేసారు. కావున, పోస్ట్‌లో అది ఏదో వింతలా చూపెడుతూ తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్‌లోని వీడియోని సరిగ్గా గమనిస్తే, ఆ నాలుగు గుండీలు ఎక్కడికి వెళ్లాయో చాలా సులువుగా కనిపెట్టవచ్చు. వీడియో మొదట్లో మూలల్లోని బాక్సుల్లో రెండేసి గుండీలు ఉన్నట్టు చూడవచ్చు. లెక్కించేటప్పుడు ప్రతి మూలను రెండేసి సార్లు లెక్కిస్తున్నట్టు గమనించవచ్చు. మూలల్లో లేని బాక్సుల్లో మాత్రం ఒకేసారి లెక్కిస్తున్నారు (వీడియో మొదట్లో ఇలాంటి బాక్సుల్లో కేవలం ఒక గుండీనే ఉన్నట్టు గమనించవచ్చు).

ఆ నాలుగు గుండీలు ఎక్కడికి వెళ్లాయో చెప్పే ప్రక్రియ అర్థం కావడానికి, బాక్సుల్లో ఉన్న అదనపు గుండీలను నీలం రంగులో చూపెడుతున్నాము. నాలుగు గుండీలు బాక్సుల్లోకి వచ్చే ప్రతి అడుగులో, మూలల్లో ఉన్న అదనపు గుండీలు మూలల్లో లేని బాక్సుల్లోకి వెళ్తున్నట్టు చూడవచ్చు.

చివరికి వచ్చేసరికి ఒకేసారి లెక్కించే బాక్సుల్లో రెండేసి గుండీలు, రెండు సార్లు లెక్కించే మూలలలోని బాక్సుల్లో ఒకే గుండీ ఉన్నట్టు చూడవచ్చు. కాబట్టి, ఆ నాలుగు గుండీలు మాయమవలేదు.

చివరగా, ఈ వీడియోలో మధ్యలోని నాలుగు గుండీలు ఎక్కడికి పోలేదు; లెక్కించే ప్రక్రియ బట్టి మార్పులు చేసారు.

Share.

About Author

Comments are closed.

scroll