Fake News, Telugu
 

నేతాజీని యుద్ధ ఖైదీగా అప్పగించడానికి అప్పటి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పిన ఖోస్లా కమిషన్ రిపోర్ట్

0

నేతాజీ సుభాష్ చంద్రబోస్ దొరికితే యుద్ధ ఖైదీగా బ్రిటిష్ వారికి అప్పగించటానికి గాంధీ మరియు నెహ్రూ ఒప్పుకున్నారని చెప్తూ, ఉస్మాన్ పటేల్ అనే వ్యక్తి ఖోస్లా కమిషన్ ముందు చేసిన వ్యాఖ్యలతో ఉన్న ఒక ఆర్టికల్ ఫోటోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. పోస్ట్ లో పెట్టిన ఆర్టికల్ ఫోటోని సరిగ్గా గమనిస్తే, దాంట్లోని వ్యాఖ్యలను ఉస్మాన్ పటేల్ అనే వ్యక్తి ఖోస్లా కమిషన్ ముందు చెప్పినట్టు తెలుస్తుంది. నేతాజీ యొక్క అనుమాస్పద అదృశ్యం/మరణం పై భారత ప్రభుత్వం వివిధ సమయాల్లో కమిషన్లను ఏర్పాటు చేసింది, అందులో ఖోస్లా కమిషన్ ఒకటి. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: నేతాజీ దొరికితే యుద్ధ ఖైదీగా బ్రిటిష్ వారికి అప్పగించటానికి గాంధీ మరియు నెహ్రూ ఒప్పుకున్నారని చెప్తూ ఖోస్లా కమిషన్ ముందు ఉస్మాన్ పటేల్ చేసిన వ్యాఖ్యలు.

ఫాక్ట్: ఆర్టికల్ లో ఉస్మాన్ పటేల్ చేసినట్టు చెప్తున్న కొన్ని వ్యాఖ్యలను ఖోస్లా కమిషన్ రిపోర్ట్ లో చూడవొచ్చు. అయితే, ఉస్మాన్ పటేల్ చెప్పిన కథల్లో నిజం లేదని, తను చెప్పిన కథలోని విషయాలను ఒప్పుకోవడానికి అసాధ్యంగా ఉందని ఖోస్లా కమిషన్ రిపోర్ట్ లో రాసి ఉన్నట్టు తెలిసింది. అంతేకాదు, నేతాజీ ని యుద్ధ ఖైదీగా అంతర్జాతీయ సంస్థలకి అప్పగించటానికి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కూడా రిపోర్ట్ లో ఉంటుంది. కావున, పోస్ట్ లో ఉస్మాన్ పటేల్ చేసిన వ్యాఖ్యలు మాత్రమే చెప్తూ, ఆ వ్యాఖ్యల పై ఖోస్లా కమిషన్ చేసిన కామెంట్స్ ని చెప్పకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

1974 లో ఖోస్లా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ని ప్రభుత్వం వారి ‘నేతాజీ పేపర్స్’ వెబ్ సైట్ లో చూడవొచ్చు. ‘Witness No. 32’ గా ఖోస్లా కమిషన్ ముందు ఉస్మాన్ పటేల్ హాజరు అయినట్టు రిపోర్ట్ లో చూడవొచ్చు. ఖోస్లా కమిషన్ కి ఇచ్చిన సాక్ష్యాల లిస్టులో కూడా ఉస్మాన్ పటేల్ పేరుతో కొన్ని సాక్ష్యాలు ఉన్నట్టు తెలుస్తుంది.

ఆర్టికల్ లో ఉస్మాన్ పటేల్ చేసినట్టు చెప్తున్న కొన్ని వ్యాఖ్యలను కూడా ఖోస్లా కమిషన్ రిపోర్ట్ లో చూడవొచ్చు.

అయితే, ఉస్మాన్ పటేల్ చెప్పిన కథల్లో నిజం లేదని, తను చెప్పిన కథలోని విషయాలను ఒప్పుకోవడానికి అసాధ్యంగా ఉందని ఖోస్లా రిపోర్ట్ లో రాసి ఉన్నట్టు చదవొచ్చు.

అంతేకాదు, నేతాజీ ని యుద్ధ ఖైదీగా అంతర్జాతీయ సంస్థలకి అప్పగించటానికి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, ఆ వాదన లో ఎటువంటి నిజం లేదని ఖోస్లా కమిషన్ రిపోర్ట్ లో చదవొచ్చు. పార్లమెంట్ లో కూడా ఈ విషయం పై 1963 లో ప్రభుత్వం సమాధానం ఇచ్చినట్టు తెలిసింది.

వివిధ కమిషన్లు నేతాజీ యొక్క అనుమాస్పద అదృశ్యం/మరణం పై ఇచ్చిన రిపోర్ట్ల సారాంశం ఇక్కడ చూడవొచ్చు. 

చివరగా, ఉస్మాన్ పటేల్ చెప్పిన కథల్లో నిజం లేదని మరియు నేతాజీ ని యుద్ధ ఖైదీగా అప్పగించడానికి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఖోస్లా కమిషన్ రిపోర్ట్ లో చూడవొచ్చు.

Share.

About Author

Comments are closed.

scroll