నేపాల్‌లో ఒక చోట వర్షాల సమయంలో ఒక బుద్ధుని విగ్రహాన్ని ఒక 15 అడుగుల పాము రక్షించడానికి చుట్టుముడుతుంది పేర్కొంటున్న వీడియో (ఇక్కడ మరియు ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: నేపాల్‌లో వర్షం వచ్చినప్పుడల్లా ఒక 15 అడుగుల పాము ఒక బుద్ధుని విగ్రహాన్ని ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు చుట్టుముడుతుంది.
ఫ్యాక్ట్(నిజం): వీడియోలో కనిపిస్తున్న పాము నిజమైనది కాదు, అది కేవలం ఒక మెకానిక్ మోడల్ మాత్రమే. దీన్ని శ్రీలంకలో తయారు చేసి ప్రదర్శించారు. కావున పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.
వైరల్ వీడియోలో చేస్తున్న క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, వాన వచ్చినప్పుడల్లా వీడియోలో కనిపిస్తున్నట్టుగా, నేపాల్‌లో ఒక పాము ఒక బుద్ధుని విగ్రహాన్ని కాపాడుతుంది అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదు.
ఈ వీడియో గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి, అందులోని కొన్ని స్క్రీన్‌షాట్‌లపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఇవే విజువల్స్‌తో ఉన్న యాట్యూబ్ వీడియో ఒకటి మాకు లభించింది.
ఈ వీడియో టైటిల్‌లో ‘శ్రీలంక’ అనే పేరును గమనించి, ఇది శ్రీలంకలో తీసిన వీడియో అని క్యూ తీసుకొని, మేము శ్రీలంకలో బుద్ధుడిని కప్పి ఉన్న పాములు వీడియోల కోసం ఇంటర్నెట్లో వెతికాము. ఈ సెర్చ్ ద్వారా బుద్ధ విగ్రహాన్ని పాము చుట్టుముట్టి కప్పుతున్న విజువల్స్ ఉన్న చాలా వీడియోలు మాకు దొరికాయి. వాటిని మీరు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
ఈ వీడియోలలో ‘ముచలింద నాగదారణయ’ అని ఈ విగ్రహాన్ని వివరించడం గమనించాము. ముచలింద అనేది గౌతమ బుద్ధుని జ్ఞానోదయం తరువాత, తనను రకరకాల అపాయాల నుంచి రక్షించిన నాగుపాము లాంటి జీవి పేరు అని ఒక గూగుల్ సెర్చ్ ద్వారా మాకు తెలిసింది.
యూట్యూబ్‌లో ఈ విగ్రహం ఉన్న వీడియోలలో ఒక పాము లాంటి ఒక మెకానికల్ మోడల్ (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఒక బుద్ధ విగ్రహాన్ని చుట్టుముట్టడం మనం చూడవచ్చు. ఈ వీడియోలలో ఒకదానిలో ఉన్న బ్యానర్‌ని ఆంగ్లంలోకి అనువదించి చూడగా ‘శ్రీలంక ల్యాండ్ రిక్లైమేషన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ వారు ఈ మెకానికల్ ముచలిందను వేసక్(బుద్ధ పూర్ణిమ) సందర్భంగా ప్రజలు చూడడానికి ప్రదర్శనకి పెట్టారని(ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) మాకు తెలిసింది.
అలాగే వైరల్ వీడియో యొక్క ప్రారంభ భాగంలో సింహళ భాషలో కనిపించే కొన్ని పదాలు ఉన్నాయి, వైరల్ వీడియోలో చెప్తున్నట్లు నేపాలీ కాదు. ఈ పదాలను ఆంగ్లంలోకి అనువదించి చూడగా, అది ‘ముచలింద నగదారనాయ’ అనే పదం అని మాకు తెలిసింది.
అలాగే, మనం సరిగ్గా గమనిస్తే, వీడియోలోని పాము కళ్ళు అప్పుడప్పుడు ఎర్రటి కాంతితో మెరుస్తూ ఉంటాయి. అలాగే, వీడియోలో కనిపించే సౌండ్ మరియు లైట్ ఎఫెక్ట్స్ అన్ని కూడా యూట్యూబ్‌లో ఉన్న వేరే ముచలింద నాగదారణాయ వీడియోలలో కనిపించే కృత్రిమ సెట్టింగ్‌ల మాదిరిగానే కనిపిస్తుంది.
అదనంగా, వైరల్ వీడియోలో ఉన్న ముచలింద విగ్రహం వంటి మోడల్ యొక్క వీడియో ఒకటి, శ్రీలంకకు చెందిన జర్నలిస్ట్ అప్లోడ్ చేసిన ఒక ఫేస్‌బుక్ పోస్ట్ లభించింది. ఈ మెకానికల్ మోడల్‌ను ఎలా తయారు చేస్తారు అని వివరిస్తూ, ‘Circuit Bro’ అనే యూట్యూబ్ ఛానల్ ఒక వీడియోను పోస్ట్ చేసింది. దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, బుద్ధుని విగ్రహం చుట్టూ ఒక పాము తిరిగేలా తయారు చేసి, శ్రీలంకలో ప్రదర్శనకు పెట్టిన ఒక మెకానికల్ మోడల్ వీడియోను నేపాల్‌లో వర్షం వచ్చినప్పుడు ఒక 15 అడుగుల పాము ఒక బుద్ధుని విగ్రహాన్ని చుట్టుముట్టి కాపాడుతుంది అని చెప్తూ ఒక అబద్దపు కథనంతో షేర్ చేస్తున్నారు.