Fake News, Telugu
 

వీడియోలోని పక్షి ‘జఠాయవు’ కాదు, అది ‘ఆండియన్ కాండోర్’. అంతేకాదు, ఆ వీడియోను అర్జెంటీనాలో చిత్రీకరించారు

0

ఒక పక్షి ఉన్న వీడియోని ఫేస్బుక్ లో పోస్టు చేసి, అందులో ఉన్నది ‘జఠాయవు’ పక్షి అని, అది కేరళ లోని సర్వమంగళ అటవీ ప్రాంతంలో దర్శనమిచ్చిందని చెప్తున్నారు. ‘జఠాయవు’ పక్షిని హిందూ ఇతిహాసం ‘రామాయణం’ లో ప్రస్తావించారు, దానిని హిందువులు దైవంగా భావిస్తారు. కానీ ఈ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: కేరళ లోని సర్వమంగళ అటవీ ప్రాంతంలో ‘జఠాయవు’ పక్షి దర్శనమిచ్చిన వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియోలోని పక్షి ‘జఠాయవు’ కాదు, అది ‘ఆండియన్ కాండోర్’. అంతేకాదు, ఆ వీడియోను అర్జెంటీనాలో చిత్రీకరించారు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.    

వీడియో యొక్క స్క్రీన్‌షాట్‌ లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ‘The Dodo’ యొక్క కథనం సెర్చ్ రిజల్ట్స్ లో లభించింది. ఆ కథనం ప్రకారం, వీడియోలో కనిపించే పక్షి ‘సయాని’ అనే ‘ఆండియన్ కాండోర్’, దానిని 2014 లో అర్జెంటీనాలోని వైల్డ్ లైఫ్ సంరక్షకులు చికిత్స అనంతరం విడుదల చేశారు. ‘సయాని’ 2012 లో కాటమార్కా (అర్జెంటీనా) ప్రాంతంలోని స్థానిక రాంచెర్స్ వల్ల  విషప్రయోగానికి గురై ప్రాణాపాయ స్థితిలో లభించింది. వీడియో గురించి అదే సమాచారంతో ఉన్న కథనాలను ఇక్కడ మరియు ఇక్కడ చదవవచ్చు. ‘సయాని’ ని అర్జెంటీనాలోని వైల్డ్ లైఫ్ సంరక్షణ అధికారులు విడుదల చేయడానికి సంబంధించిన పూర్తి వీడియో ని ఇక్కడ చూడవచ్చు. 

చివరగా, వీడియోలోని పక్షి ‘జఠాయవు’ కాదు, అది ‘ఆండియన్ కాండోర్’. అంతేకాదు, ఆ వీడియోను అర్జెంటీనాలో చిత్రీకరించారు. 

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll