Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

కొరోనా పై ‘ఎటువంటి మెసేజ్ పెట్టినా’ గ్రూప్ అడ్మిన్లను మరియు మెంబెర్లను అరెస్ట్ చేస్తారనేది ఫేక్ వార్త

0

సుప్రీంకోర్టు అత్యవసర ఉత్తర్వులు జరీ చేసిందని, వాటి ప్రకారం ‘సోషల్ మీడియాలో కొరోనాకి సంబంధించిన ఎటువంటి పోస్ట్ లు, షేర్ లు, ఫార్వార్డింగ్, కామెంట్స్, ఏదైనా సరే చేయడం జరిగితే ఫస్ట్ అడ్మిన్ గారిని తర్వాత గ్రూప్ మెంబర్స్ ను ఐపీసీ 68, 140 మరియు 188 సెక్షన్ల ప్రకారం ఎత్తి లోపలేస్తారు’ అని చెప్తూ ఒక మెసేజ్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: కొరోనా మీద ఎటువంటి మెసేజ్ పెట్టినా ఐపీసీ 68, 140 మరియు 188 సెక్షన్ల కింద అరెస్ట్ చేయమని సుప్రీమ్ కోర్టు ఉత్తర్వులు జరీ చేసింది.

ఫాక్ట్ (నిజం): ఎటువంటి మెసేజ్ పెట్టినా’ అని సుప్రీం కోర్ట్ అనలేదు, కేవలం ఫేక్ మెసేజ్లను పెట్టొద్దని సుప్రీమ్ కోర్టు చెప్పింది. ఫేక్ మెసేజ్లను పెట్టి, ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తే సెక్షన్ 54 (డిసాస్టర్ మేనేజ్మెంట్ చట్టం, 2005) ప్రకారం తగిన చర్యలు తీసుకోమని చెప్పింది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు. 

సుప్రీమ్ కోర్టు అలాంటి ఉత్తర్వులు ఏమైనా జారీ చేసిందా అని వెతకగా, కొరోనా కి సంబంధించి ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎటువంటి ఫేక్ న్యూస్ ని పెట్టొద్దని వార్తాసంస్తలను సుప్రీమ్ కోర్టు కోరినట్టు తెలుస్తుంది. ‘ఎటువంటి మెసేజ్ పెట్టినా’ అని అనలేదు, కేవలం ఫేక్ మెసేజ్లను పెట్టొద్దని చెప్పింది. అలా ఫేక్ మెసేజ్లను పెట్టి, ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తే సెక్షన్ 54 (డిసాస్టర్ మేనేజ్మెంట్ చట్టం, 2005) ప్రకారం తగిన చర్యలు తీసుకోమని చెప్పింది. అంతేకాదు, ప్రభుత్వ అధికారుల ఇచ్చిన ఆదేశాలకు విరుద్దంగా ఎవరైనా ప్రవర్తిస్తే ఐపీసీ 188 సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకోమని చెప్పింది. పూర్తి సుప్రీమ్ కోర్టు ఆదేశాల కాపీని ఇక్కడ చదవొచ్చు.

పోస్టులో ఇచ్చిన ఐపీసీ 68 మరియు 140 సెక్షన్ల ప్రకారం ‘ఎటువంటి మెసేజ్ పెట్టినా’ అరెస్ట్ చేయమని ప్రభుత్వం కానీ, సుప్రీమ్ కోర్టు కానీ తెలపలేదు. ఐపీసీ 68 మరియు 140 సెక్షన్ల గురించి కింద చదవొచ్చు. అసలు ఈ సెక్షన్లకి మెసేజిలు పెట్టడానికి ఎటువంటి సంబంధం లేదు.

ప్రభుత్వం తప్ప ఎవరూ కూడా కొరోనా మీద పోస్టులు పెట్టొద్దని, కొరోనా పై జోకులు పెడితే కూడా పోలీసులు గ్రూప్ అడ్మిన్లను మరియు మెంబెర్లను అరెస్ట్ చేస్తారని ఇంతకు ముందు కూడా కొన్ని మెసేజిలు వైరల్ అవ్వగా అవి ఫేక్ అని ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ వారు పెట్టిన ట్వీట్లను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. కావున, కొరోనా పై మెసేజ్లు పెట్టొచ్చు, కానీ ఫేక్ మెసేజ్లను పెట్టొద్దు.

చివరగా, కొరోనా పై ‘ఎటువంటి మెసేజ్ పెట్టినా’ గ్రూప్ అడ్మిన్లను మరియు మెంబెర్లను అరెస్ట్ చేస్తారనేది ఫేక్ వార్త.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll