Fake News, Telugu
 

కావేరి ట్రావెల్స్ వారు నిజంగానే 125 బస్సులను ఎన్నికల ముందు రోజున రద్దు చేసారు

0

ఎన్నికలకు ఒక్క రోజు ముందు తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళ వలసిన కావేరి ట్రావెల్స్ సంస్థ బస్సులు రద్దయ్యాయి అంటూ  ఒక పోస్ట్ ని చాలా మంది ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా):కావేరి ట్రావెల్స్ పోలింగ్ కు కొన్ని గంటలు మాత్రమే ఉన్న సమయంలో ఈ నెల 10న వెళ్ళాల్సిన 125 బస్సులను అకస్మాత్తుగా రద్దు చేసింది.

ఫాక్ట్ (నిజం): కావేరి ట్రావెల్స్ సంస్థ నిజంగానే 125 బస్సులను రద్దు చేసింది. కావున పోస్ట్ లో చెప్పింది నిజం.

పోస్ట్ లో ఉన్న వార్త గురించి గూగుల్ లో వెతికగా సెర్చ్ రిజల్ట్స్ లో ఈ విషయం పై వివిధ వార్తా సంస్థలు ప్రచురించిన ఆర్టికల్స్ లభిస్తాయి. The Hans India ఆర్టికల్ ప్రకారం కావేరి ట్రావెల్స్ సంస్థ నిజంగానే 125 బస్సులను రద్దు చేసింది, రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు ‘అనివార్య కారణాల’ వల్ల బస్సులను రద్దు చేస్తున్నట్టు మెసేజెస్ పంపించింది. Times of india వారితో మాట్లాడుతూ పర్మిట్ లేని బస్సులను సీజ్ చేస్తారనే భయంతో రద్దు చేసినట్టుగా ఒక ట్రావెల్ సంస్థ ఓనర్ చెప్పాడు. ఇదే విషయం పై ABN ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ వారు ఒక న్యూస్ ఐటమ్ కూడా ప్రచురించారు. కావున, పోస్ట్ లో చెప్పినట్టుగా కావేరి ట్రావెల్స్ 125 బస్సులను రద్దు చేసారు.

చివరగా, కావేరి ట్రావెల్స్ వారు నిజంగానే 125 బస్సులను ఎన్నికల ముందు రోజున రద్దు చేసారు.

Share.

About Author

Comments are closed.

scroll