Fake News, Telugu
 

సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు తీసిన ఫోటోని కూరగాయలు అమ్ముతున్న ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ సుధా మూర్తి అని షేర్ చేస్తున్నారు

0

ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి గారి భార్య సుధా మూర్తి సంవత్సరంలో ఒక రోజు ఇలా కూరగాయలు అమ్ముతుంటారు, అని షేర్ చేస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.       

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ సుధా మూర్తి సంవత్సరంలో ఒక రోజు కూరగాయలు అమ్ముతుంటారు.

ఫాక్ట్ (నిజం):  ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ సుధా మూర్తి ప్రతి సంవత్సరం తన ఇంటి దగ్గరలో ఉన్న రాఘవేంద్ర స్వామి మఠంలో మూడు రోజులు పాటు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. భక్తులకు భోజనాలు సిద్దం చేయడం, కూరగాయలు కొయ్యడం, దేవుడికి దండలు తయారు చేయడం లాంటి పనులు చేస్తుంటారు. ఆలయంలో ఆమె సేవ చేస్తున్న సందర్బంలో తీసినదే ఈ పోస్టులోని ఫోటో. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్టులో షేర్ చేసిన ఫొటోకు సంబంధించిన వివరాల కోసం గూగుల్ లో వెతకగా, సుధా మూర్తి గురించి ‘BangaloreMirror’ వార్త పత్రిక వారు రాసిన ఒక ఆర్టికల్  దొరికింది. ఆ ఆర్టికల్ లో సుధా మూర్తి  తన ఇంటి దగ్గరలో ఉన్న రాఘవేంద్ర స్వామి మఠంలో ప్రతి సంవత్సరం మూడు రోజులు  పాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు భోజనాలు సిద్దం చేయడం, కూరగాయలు కోయడం అలాగే, దేవుడి దండలను తయారు చెయ్యడం లాంటి పనులు చేస్తుంటారని అందులో తెలిపారు. సుధా మూర్తి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు తీసిన ఫోటోలను జత చేస్తూ ‘One India Kannada’ వారు రాసిన ఆర్టికల్ లో కూడా చూడవచ్చు. రాఘవేంద్ర స్వామి మఠంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు తీసిన ఆ ఫోటోని చూపిస్తూ కూరగాయలు అమ్ముతున్న ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ సుధా మూర్తి అని షేర్ చేస్తున్నారు.

ఈ ఫోటో లోని దృశ్యాని చూపిస్తూ సాక్షి న్యూస్ ఛానల్ ‘22 ఆగష్టు 2016’ నాడు యూట్యూబ్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ సుధా మూర్తి రాయర మఠం ముందు కూరగాయలు అమ్ముతున్న దృశ్యం అని ఆ వీడియోలో తెలిపారు. అయితే ఇటివలే ఈ ఫోటో మళ్ళీ అదే క్లెయిమ్ తో వైరల్ అవ్వగా, అది తప్పుడు ప్రచారం అని తెలుపుతూ సాక్షి న్యూస్ వెబ్ సైట్ వారే ఫాక్ట్ చెక్ ఆర్టికల్ రాసారు. ఆ ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు తీసిన ఫోటోని చూపిస్తూ కూరగాయలు అమ్ముతున్న ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ సుధా మూర్తి అని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll