Fake News, Telugu
 

బుందేల్‌ఖండ్ ప్రాంత నీటిపారుదల రంగం గురించి వివరించే క్రమంలో శ్రీశైలం డ్యామ్ ఫోటోని షేర్ చేస్తున్నారు

0

ఉత్తరప్రదేశ్ బీజేపీకి చెందిన నాయకులు బుందేల్‌ఖండ్ ప్రాంతంలో నీటిపారుదల రంగంలో జరిగిన అభివృద్ధిని వివరించే క్రమంలో ఒక డ్యామ్ ఫోటో షేర్ చేసిన పోస్టులు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ)  సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఈ కథనం ద్వారా ఆ ఫోటోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్ బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని ఒక డ్యామ్ ఫోటో.

ఫాక్ట్(నిజం): ఈ ఫోటోలో ఉన్నది మహబూబ్‌నగర్, కర్నూలు సరిహద్దులో కృష్ణా నదిపై శ్రీశైలం నిర్మించిన శ్రీశైలం డ్యామ్. గతంలో అనేక వార్తా కథనాలు ఇదే ఫోటోని శ్రీశైలం డ్యామ్ అంటూ ప్రచురించాయి.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇటీవల 19 నవంబర్ 2021న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో సాగు, తాగు నీటికి సంబంధించి పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసారు. వైరల్ అవుతున్న డ్యామ్ ఫోటోని ఈ నేపథ్యంలోనే షేర్ చేసారు.   

ఐతే నిజానికి ఈ ఫోటో ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలలో కృష్ణా నదిపై నిర్మించిన శ్రీశైలం డ్యామ్ కి సంబంధించింది. వైరల్ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోని ప్రచురించిన పలు వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) మాకు కనిపించాయి. ఈ కథనాల ప్రకారం ఈ ఫోటోలో ఉన్నది మహబూబ్‌నగర్, కర్నూలు సరిహద్దులో కృష్ణా నదిపై శ్రీశైలం నిర్మించిన శ్రీశైలం డ్యామ్.

చివరగా, బుందేల్‌ఖండ్ ప్రాంత నీటిపారుదల రంగం గురించి వివరించే క్రమంలో శ్రీశైలం డ్యామ్ ఫోటోని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll