Fake News, Telugu
 

బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొనలేదు

0

గత వైఎస్సార్ ప్రభుత్వం మైనార్టీలకు అన్యాయంగా 4% రిజర్వేషన్లు కట్టబెట్టిందని, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు” అని చెప్తున్న ‘Way2News’ కథనం మరియు ‘ABN’ తెలుగు న్యూస్ ఛానల్ యొక్క బ్రేకింగ్ న్యూస్  క్లిప్పింగ్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి(ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఇలాంటి మరికొన్ని పోస్టుల యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు అంటూ Way2News, ABN తెలుగు న్యూస్ ఛానల్ కథనాలు ప్రచురించాయి.

ఫాక్ట్(నిజం): బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారని కథనాలు, న్యూస్ క్లిప్పింగ్స్ వైరల్ అవగా అవి ఫేక్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వాటిని ఖండించారు అని పలు వార్త కథనాలు రిపోర్ట్ చేసాయి. అలాగే, వైరల్ పోస్టులో షేర్ చేసిన వార్త కథనం పైన ఉన్న ఆర్టికల్ లింక్ ద్వారా ‘Way2News’లో వెతికితే “తుని: దాడిశెట్టి హ్యాట్రిక్కా? దివ్య బోణీ కొట్టేనా?” అనే టైటిల్‌తో ప్రచురించిన అసలైన వార్త దొరికింది. అలాగే, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి  కూడా తాము ఇటువంటి వార్తను ప్రసారం చేయలేదని, ఇది ఫేక్ న్యూస్ క్లిప్ అని 09 ఏప్రిల్ 2024 నాడు స్పష్టం చేసింది. అంతే కాకుండా, ఈ వార్త ఫేక్ అని టీడీపీ మరియు బీజేపీ పార్టీలు తన అధికారిక X(ట్విట్టర్) ద్వారా తెలిపాయి. ఈ కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ పోస్టులలో తెలిపినట్లుగా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతికితే, దీనికి సంబంధించి ఎటువంటి న్యూస్ రిపోర్ట్స్ లభించలేదు. పైగా, ఈ వార్త కథనాలు మరియు క్లిప్పింగ్స్  వైరల్ అవగా అవి ఫేక్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వాటిని ఖండించారు అని చెప్తున్నా పలు వార్త కథనాలు లభించాయి (ఇక్కడ & ఇక్కడ).

అలాగే ఈ వార్తను Way2News సంస్థ కూడా ప్రచురించలేదు అని తెలిసింది. వైరల్ పోస్టులో షేర్ చేసిన వార్త కథనం పైన ఉన్న ఆర్టికల్ లింక్ (https://way2.co/z5cvsd) ద్వారా ‘Way2News’లో వెతికితే “తుని: దాడిశెట్టి హ్యాట్రిక్కా? దివ్య బోణీ కొట్టేనా?” అనే టైటిల్‌తో ప్రచురించిన అసలైన వార్త దొరికింది. దీన్ని బట్టి అసలైన ‘Way2News’ కథనాన్ని ఎడిట్ చేస్తూ పోస్టులో షేర్ చేసిన ఫోటోని రూపొందించారు అని నిర్థారించవచ్చు.

అలాగే, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి  తాము ఇటువంటి వార్తను ప్రసారం చేయలేదని, ఇది ఫేక్ న్యూస్ క్లిప్ అని 09 ఏప్రిల్ 2024 నాడు స్పష్టం చేసింది (ఇక్కడ మరియు ఇక్కడ). అంతే కాకుండా, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు అని చెప్తున్న వార్త కథనాలు, న్యూస్ క్లిప్పింగ్స్ ఫేక్ అని టీడీపీ తమ అధికారిక X(ట్విట్టర్) అకౌంటులో ట్వీట్ (ఆర్కైవ్) చేసింది. ఈ వార్త ఫేక్ అని బీజేపీ కూడా తమ అధికారిక X(ట్విట్టర్) అకౌంటులో ట్వీట్ (ఆర్కైవ్) చేసింది.

చివరగా, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు అని Way2News మరియు ABN న్యూస్ ప్రచురించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll