Fake News, Telugu
 

‘బేటీ బచావో బేటీ పడావో’ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత బాలికల డ్రాప్‌అవుట్ రేట్ పూర్తిగా తగ్గిపోయిందన్న వార్తలో నిజం లేదు

0

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘బేటీ బచావో బేటీ పడావో’ పథకం వల్ల స్కూల్ డ్రాపౌట్స్ పూర్తిగా తగ్గిపోయాయని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘బేటీ బచావో బేటీ పడావో’ పథకం వల్ల స్కూల్ డ్రాపౌట్స్ పూర్తిగా తగ్గిపోయాయి.

ఫాక్ట్ (నిజం): ‘ది యూనిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ స్కూల్ ఎడ్యుకేషన్ (UDISE)’ ఇటీవల విడుదల చేసిన UDISE 2019-20 రిపోర్ట్ ప్రకారం ప్రైమరీ స్కూల్ (1-5 క్లాస్) స్థాయిలో బాలికల స్కూల్ డ్రాప్‌అవుట్ రేట్ వార్షిక సగటు 1.2% కాగా, అప్పర్ ప్రైమరీ (6-8 క్లాస్) స్థాయిలో ఇది 3%, అదేవిధంగా సెకండరీ స్కూల్ (9-10 క్లాస్) స్థాయిలో ఇది ఏకంగా 15.1%గా ఉంది. 2013-14 నుండి 2019-20 మధ్య కాలంలో ప్రైమరీ స్కూల్ స్థాయిలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల స్కూల్ డ్రాప్‌అవుట్ శాతం తక్కువగా ఉంది. అదే అప్పర్ ప్రైమరీ స్థాయిలో బాలికల స్కూల్ డ్రాప్‌అవుట్ రేట్ అబ్బాయిలతో పోలిస్తే ఎక్కువగా ఉంది. ఇక సెకండరీ స్కూల్ స్థాయిలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల స్కూల్ డ్రాప్‌అవుట్ శాతం తక్కువగా ఉన్నప్పటికీ వ్యత్యాసం మాత్రం ఎక్కువగా ఏమి లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ‘ది యూనిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ స్కూల్ ఎడ్యుకేషన్ (UDISE)’ ఇటీవల విడుదల చేసిన UDISE 2019-20 రిపోర్ట్ ప్రకారం ప్రైమరీ స్కూల్ (1-5 క్లాస్) స్థాయిలో బాలికల స్కూల్ డ్రాప్‌అవుట్ రేట్ వార్షిక సగటు 1.2% కాగా, అప్పర్ ప్రైమరీ (6-8 క్లాస్) స్థాయిలో ఇది 3%, అదేవిధంగా సెకండరీ స్కూల్ (9-10 క్లాస్) స్థాయిలో ఇది ఏకంగా 15.1%గా ఉంది. ఇదే విషయాన్ని లోక్ సభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా విద్యా శాఖ మంత్రి తెలిపారు.

ప్రైమరీ మరియు సెకండరీ స్కూల్ స్థాయిలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల స్కూల్ డ్రాప్‌అవుట్ శాతం తక్కువగా ఉన్నప్పటికీ, అప్పర్ ప్రైమరీ స్థాయిలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల డ్రాప్‌అవుట్ రేట్ ఎక్కువగా ఉంది. ప్రైమరీ స్కూల్ స్థాయిలో బాలికల స్కూల్ డ్రాప్‌అవుట్ రేట్ 1.2% కాగా అబ్బాయిల డ్రాప్‌అవుట్ రేట్ 1.7%గా ఉంది. అదే అప్పర్ ప్రైమరీ స్థాయిలో బాలికల స్కూల్ డ్రాప్‌అవుట్ రేట్ 3% కాగా అబ్బాయిల డ్రాప్‌అవుట్ రేట్ 2.2%. ఇక సెకండరీ స్కూల్ స్థాయిలో బాలికల స్కూల్ డ్రాప్‌అవుట్ రేట్ 15.1% కాగా అబ్బాయిల డ్రాప్‌అవుట్ రేట్ 17%.

బేటీ బచావో బేటీ పడావో:

క్షీణిస్తున్న చైల్డ్ సెక్స్ రేషియో (CSR), మహిళా సాధికారత, లింగ అసమానత తొలగించే లక్ష్యాలతో 2015లో కేంద్ర ప్రభుత్వం ‘బేటీ బచావో బేటీ పడావో’ అనే పథకాన్ని ప్రారంభించింది.  ఈ పథకం ఆడపిల్లల విద్యాభ్యాసానికి కూడా తోడ్పాటును అందిస్తుంది.

ఐతే UDISE డాష్బోర్డ్ లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ‘బేటీ బచావో బేటీ పడావో’ పథకం ప్రవేశపెట్టినప్పటి నుండి ప్రతీ సంవత్సరం అమ్మాయిల డ్రాపౌట్ రేట్ పెరుగుతూ, తగ్గుతూ ఉంది కాని ఏ సంవత్సరం పూర్తిగా తగ్గిపోలేదు. 2013-14 నుండి 2019-20 మధ్య కాలంలో ప్రైమరీ స్కూల్ స్థాయిలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల స్కూల్ డ్రాప్‌అవుట్ శాతం తక్కువగా ఉంది. అదే అప్పర్ ప్రైమరీ స్థాయిలో బాలికల స్కూల్ డ్రాప్‌అవుట్ రేట్ అబ్బాయిలతో పోలిస్తే ఎక్కువగా ఉంది. ఇక సెకండరీ స్కూల్ స్థాయిలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల స్కూల్ డ్రాప్‌అవుట్ శాతం తక్కువగా ఉన్నప్పటికీ వ్యత్యాసం మాత్రం ఎక్కువగా ఏమి లేదు. స్కూల్ విద్యకి సంబంధించిన సమగ్ర సమాచారం ఇక్కడ చూడొచ్చు.

ఐతే పోస్టులో చెప్తున్నట్టు 2015తో పోలిస్తే 2019లో ఉన్నత విద్యలో చేరిన అమ్మాయిల సంఖ్య పెరిగిన మాట నిజమే. ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (AISHE) 2019-20 నివేదిక ప్రకారం, ఉన్నత విద్యలో మహిళల నమోదు 2015-16 నుండి 2019-20 మధ్య కాలంలో 18.2% పెరిగింది. కానీ, పోస్టులో చెప్పినట్టు స్కూల్ డ్రాప్‌అవుట్ రేట్ పూర్తిగా తగ్గిపోలేదు.

చివరగా, ‘బేటీ బచావో బేటీ పడావో’ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత బాలికల డ్రాప్‌అవుట్ రేట్ పూర్తిగా తగ్గిపోయిందన్న వార్తలో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll